మద్యం దుకాణాలకు మందు బంద్‌

0
210

అమ‌రావతిః ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం దుకాణాలకు సరఫరా ఆగిపోయింది.మద్యం అమ్మకాలను ఆన్‌లైన్ లో నియంత్రించే U.S.C సంస్థ సేవలు నిలిపివేయడంతో సరఫరాలో అంత‌రాయం ఏర్పాడింది.సంస్థకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ 17 నెలలుగా రూ.59 కోట్ల బకాయిలు చెల్లించక‌పోవ‌డంతో సద‌రు సంస్ద ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సమాచారం. మద్యం సీసాలకు బార్ కోడ్,హాలో గ్రామ్ సాఫ్ట్ వేర్‌ను U.S.C నిలిపివేసింది.ఈ సమస్య పరిష్కారం నిమిత్తం అబ్కారీ శాఖ కమిషనర్‌ను మద్యం డీలర్లు త్వ‌ర‌లో కలవనున్నారు. మ‌ద్యం దుకాణల‌కు మాన్యువల్ పద్ధతిలో మద్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు అబ్కారీ శాఖ కమిషనర్ లక్ష్మీనరసింహం ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY