తూ.గోలో ఘోర రోడ్డు ప్ర‌మాదం-6 గురు మృతి..?

0
142

తూర్పుగోదావరిః తూర్పు గోదావ‌రి జిల్లా కొత్తపేట మండలం మూడేకర్రు మహాలక్ష్మీనగర్‌ వద్ద శనివారం వేకువ‌జామున జరిగిన‌ ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురు మ‌హిళ‌లు ప్రాణాలు కోల్పోయారు.ఇసుక‌టిప్ప‌ర్‌,ఆటో ఢీకొన్న ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న అల్లవరానికి చెందిన సుమారు 13 మంది ఆత్రేయపల్లి మండలంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి బయల్దేరారు. మార్గ మధ్యంలోఇసుక టిప్ప‌ర్‌ వేగంగా వచ్చి వీరి ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 5గురు మ‌హిళ‌లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.ముందుగా స‌మాచారం అందుకున్న108 సిబ్బంది సంఘ‌ట‌న స్ద‌లంకు చేరుకుని,క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండగా మార్గం మ‌ధ్య‌లో మ‌రో మ‌హిళ మ‌ర‌ణించింది. ప్రమాదంలో గాయపడిన మరో 7గురిని అమలాపురంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఘ‌ట‌న స్ద‌లంకు చేరుకున్న కొత్తపేట పోలీసులు ఘ‌ట‌న స్ద‌లంకు చేరుకుని,కేసు న‌మోదు చేశారు.గాయాప‌డిన వారు రాజేశ్వ‌రి,భూల‌క్ష్మి,హ‌నీ,శీరిష‌,మాణిక్యంలు ఉన్నారు.ప్ర‌మాదానికి టిప్ప‌ర్ డ్రైవ‌ర్ నిర్ల‌ల‌క్ష్యమే కార‌ణ‌మని స్దానికులు ఆరోపించారు.?

LEAVE A REPLY