45వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం

చండీ ఆలంకారంలో అమ్మవారు..నెల్లూరు: రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నేటి నుండి ప్రారంభంమైయ్యాయని,అక్టోబరు 8వ తేది వరకు జరిగే దసరా ఉత్సవాల సందర్బంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీనివాసులరెడ్డి,,జిల్లా అసిస్టెంట్ కమీషనర్ ఎండోమెంట్ శాఖ అధికారి రవీంద్రరెడ్డిలు తెలిపారు.ఆదివారం నగరంలో దుర్గామిట్టిలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో 45వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో బాగంగా అమ్మవారు చండీ ఆలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.