అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సాహుల్ అనుచరుడు కందస్వామి అరెస్ట్-డిస్పీ

కడప: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సాహుల్ భాయ్ ముఖ్య అనుచరుడు, “కందస్వామి వెంకటేష్ ను ”  అరెస్ట్ చేయడం జరిగిందని ప్రొద్దుటూరు డీస్పీ సుధాకర్ తెలిపారు.గురువారం మీడియా ముందు కందస్వామిని ప్రవేశపెట్టిన సందర్బంలో అయన మాట్లాడుతూ తమిళనాడు తిరువళ్లురు జిల్లా రెడ్ హిల్స్ ప్రాంతానికి చెందిన కందస్వామి ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం చాపాడు మండలం ఖాదర్ పల్లి వద్ద చేరుకున్న సమయంలో విధి నిర్వహణలో వున్న పోలీసులను చూసి పరిపోతుండగా వెంబడించి పట్టుకోవడం జరిగిందన్నారు.కందస్వామి పై కడపజిల్లా మొత్తం మీద 38 ఎర్రచందనం కేసులు వున్నయని, చిత్తూరు జిల్లాలో మరో 9 ఎర్రచందనం కేసుల్లో ముద్దాయిగా వున్నడన్నారు.