వ్యాయ‌మంతో 90 శాతం వ్యాధులు దూరం-డాక్ట‌రు రామోహ‌న్‌రావు

0
202

నెల్లూరుః ప్రతి రోజు ఉద‌యం పూట వ్యాయ‌మం చేయ‌డంమంటే 90 శాతం వ్యాధుల‌ను దూరంగా వుంచ‌డ‌మేన‌ని డాక్ట‌రు ఎం.వి రామోహ‌న్‌రావు(ఎండోక్రైనాలాజీస్ట్ & డ‌యాబెటాల‌జిస్ట్‌) అన్నారు.శుక్ర‌వారం స్దానిక చిల్డ్ర‌న్స్‌పార్క్‌లో ప్ర‌పంచ థైయిరాడ్ దినోవ‌త్స సంద‌ర్బంగా వాక‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌డు శింగంశెట్టి.ముర‌ళీ ఏర్పాటు చేసిన అవగ‌హన కార్యాక్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ నేటి స‌మాజంలో ప్ర‌జ‌లు యంత్రాల‌కంటే వేగంగా ప‌రుగులు పెట్టాల్సి వ‌స్తుంద‌ని,దిని వ‌ల్ల గ‌తంలో లేని కొత్త ఆరోగ్య స‌మ‌స్యలు చుట్టుముడుతున్న‌య‌న్నారు. థైరాయిడ్ స‌మ‌స్య గ‌తంలో అంత‌గా లేదని అయితే ఇటీవ‌ల కాలంలో ఈ స‌మ‌స్య అంత‌కంత‌కు పెరిగిపోతుంద‌న్నారు.థైరాయిడ్‌ స‌మ‌స్య ప‌ట్ల ప్ర‌జ‌లు ఆవ‌గాహ‌న పెంచుకుని,ఎండోక్రైనాల‌జీస్ట్ ఆధ్వ‌ర్యంలో త‌గిన మందుల వాడిన‌ట్ల‌య‌తే దైన‌దిన కార్య‌క్ర‌మాల‌కు ఎలాంటి ఇబ్బందులు వుండ‌వ‌న్నారు.అనంత‌రం వాక‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు ఉచిత వైద్యశిబిరం 100 మందికి థైరాయిడ్‌,150 మందికి షుగ‌ర్ ప‌రీక్ష‌లు ఉచితంగా నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

LEAVE A REPLY