శాస్త్రీయ ప‌ద్ద‌తుల్లోనే షుగ‌ర్‌ను అదుపులో వుంచ‌వ‌చ్చు-డాక్ట‌రు.రామోహ‌న్‌

0
62

నెల్లూరుః షుగ‌ర్ వ్యాధిప‌ట్ల ప్ర‌జ‌ల్లో శాస్త్రీమైన ఆవ‌గాహ‌న లేక‌పొవ‌డంతో ఎలాంటి మెడిక‌ల్ డిగ్రీలు లేని కొంత‌మంది వ్య‌క్తులు పంక్తు వ్యాపార‌ధోర‌ణితో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్న‌ర‌ని ఎండ్రోకైనాల్‌జిస్ట్ డాక్ట‌రు.ఎం.వి రామోహ‌న్‌రావు అన్నారు.ఆదివారం చిల్ర్డ‌న్స్‌పార్క్ వాక‌ర్స్ అసోసియేష‌న్ ఆద్వ‌ర్యంలో చిల్ర్డ‌న్స్‌పార్క్ లో ఏర్పాటు చేసిన ఉచిత షుగ‌ర్ నిర్ద‌రాణ శిబిరంలో పాల్గొన్న సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ ఇటీవ‌ల కాలంలో షుగ‌ర్ వ్యాధిని కేవ‌లం కొన్ని ర‌కాలు పండ్లు,నూనెలు,(కోటో డైట్స్‌) ఆహార‌ప‌దార్ద‌లు వాడ‌డం వ‌ల్ల పూర్తి న‌యం చేస్తామంటు,అశాస్ర్తీమైన ప‌ద్ద‌తులను ప్ర‌జ‌ల‌కు ఆల‌వాటు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు.వారి మాటలు న‌మ్మి,షుగ‌ర్ బాదితులు ప్రాణ‌ల‌పైకి తెచ్చుకోవ‌డం ఆవేద‌న క‌ల్పిస్తుంద‌న్నారు.డాక్ట‌ర్లు సల‌హాల మేర‌,షుగ‌ర్‌కు త‌గిన మందులు వాడుతు,ఆహారం నియంత్ర‌ణంలో వుంచుకోవ‌డం,శ‌రీరానికి త‌గిన వ్యాయ‌మం ఇవ్వ‌డం వ‌ల్ల షుగ‌ర్‌ను అదుపులో వుంచుకోవ‌చ్చాన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో చిల్ర్డ‌న్స్‌పార్క్ వాక‌ర్స్ అసోసియేష‌న్ స‌భ్యులు ముర‌ళీ,బ‌ల‌రామిరెడ్డి,ర‌ఘ‌రామ‌య్య‌,జ‌య‌రామిరెడ్డి,త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY