Dr.M.V రామ్మోహ‌న్‌కు అంత‌ర్జాతీయ పుర‌స్కారం

0
80

నెల్లూరుః పేద‌,మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల్లో రోగ‌పీడితుల‌కు నాణ్య‌మైన వైద్యం అందిస్తూ,నెల్లూరు న‌గరంలోని ప్ర‌ముఖ ఎండోక్రైన‌ల‌జిస్ట్‌గా ఉన్న Dr.M.V రామ్మోహ‌న్‌కు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు ల‌భించింది.మార్చి 17 నుండి 20వ‌ తేది వ‌ర‌కు అమెరికాలోని చికాగోలో జ‌రిగిన ప్ర‌పంచ స్థాయి 100వ ఎండోక్రైన్ స‌ద‌స్సులో నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిట‌ల్ ఎండోక్రైనాల‌జిస్ట్ Dr.M.V రామ్మోహ‌న్‌కు హెల్‌మెస్సీ ట్ర‌స్ట్ అవార్డుతో పాటూ 1000 డాల‌ర్ల పుర‌స్కారాన్న అందించింది.చిన్న‌పిల్ల‌ల్లో వ‌చ్చే మ‌ధుమేహ వ్యాధికి సంబంధించి,చేసిన ప‌రిశోధ‌న‌లు, వైద్య‌విధానాల‌పై ఇటీవ‌ల ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.వీటిని ప‌రిశీలించిన హెల్‌మెస్సీ ట్ర‌స్ట్,Dr.M.V రామ్మెహ‌న్‌కు అంత‌ర్జాతీయ పుర‌స్కారాన్ని అందించింది.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే ఈ త‌ర‌హా అవార్డు అందుకున్న తొలి వైద్యుడు ఈయ‌నే కావ‌డం విశేషం.అమెరికాదేశంలోని చికాగో న‌గ‌రంలో నెల్లూరు ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన Dr.M.V రామ్మోహ‌న్ వైద్య వృత్తిలో మ‌రింత అభివృద్ధి సాధించాల‌ని కోరుకుందాం.

LEAVE A REPLY