ఈ స్మార్ట్‌ఫోన్‌లో రేడియోష‌న్ మీ కొంప ముంచుతుంది ?

అమ‌రావ‌తిః చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా నేడు అన్ని త‌రాల వాళ్లు క్ష‌ణం గ‌డ‌ప‌లేకున్నారు.ఇంత‌గా స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్న వినియోగ‌దారుల్లో స్మార్ట్‌ఫోన్లు విడుద‌ల చేసే రేడియోష‌న్ గురించి ప‌ట్టించుకోక‌పోవ‌డం బాధ‌క‌ర‌మైన విష‌యం.ఈ నేపథ్యంలో జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్ సంస్థ విడుదల చేసిన నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది.షావోమి,వన్‌ ప్లస్‌కు చెందిన నాలుగు స్మార్ట్‌ఫోర్లు అతి ప్రమాదకరమైనవిగా పేర్కొంది.ముఖ్యంగా చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులు రూపొందించిన నాలుగు స్మార్ట్‌ఫోన్లు గరిష్టంగా రేడియేషన్‌ను విడుదల చేస్తున్నాయని ఈ నివేదిక తేల్చింది.టాప్‌ 16 జాబితాలో ఎనిమిది ఫోన్లు షావోమి,వన్‌ ప్లస్‌కి చెందినవి ఉన్నాయని వెల్లడించింది.షావోమికి చెందిన ఆండ్రాయిడ్‌ వన్‌ స్మార్టఫోన్‌ ఎంఐఏ1, వన్‌ప్లస్‌ 5టీ స్మార్ట్‌ఫోన్లు ముందువరుసలో ఉన్నాయి.షావోమి,వన్‌ప్లస్‌ల త‌రువాత వ‌రుస‌లోయాపిల్‌ ఐ ఫోన్‌​ 7 నిలిచింది.దీంతోపాటు యాపిల్‌ ఐ ఫోన్‌ 8,గూగుల్‌ పిక్సెల్‌ 3,పిక్సెల్‌ 3 ఎక్స్‌ఎల్‌ స్మార్ట్‌ఫోన్ల రేడియేషన్‌ అత్యధికంగానే నమోదైందని రిపోర్టులో తెలిపింది.మరోవైపు అతి తక్కువ రేడియేషన్‌ ప్రభావం ఉన్న ఫోన్లలో కొరియా దిగ్గజం శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లు నిలవడం గమనించ‌త‌గ్గ ఆంశం.ఎల్‌జీ,హెచ్‌టీసీ,మోటో,హువావే,హానర్ కంపెనీలకుచెందిన కొన్ని ఫోన్లు తక్కువ రేడియేషన్‌ విడుదల చేస్తున్నాయని నివేదించింది.ఇతర చైనా కంపెనీలు ఒప్పో,వివో తయారు చేసిన స్మార్ట్‌ఫోన్లను ఇంక‌ పరీక్షించలేదని పేర్కొంది?

LEAVE A REPLY