స్టాలిన్‌కు మాత్రమే డి.ఎం.కే పార్టీని నడిపించే స‌త్తా ఉంది-టి.ఆర్ బాలు

అమ‌రావ‌తిః మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించక పోయి ఉంటే త‌న తండ్రితో పాటు తాను కూడా సమాధి అయి ఉండేవాడినని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మంగళవారం ఉద్వేగం వ్యాఖ్య‌నించారు.పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరుణానిధి వంటి గొప్ప నేతను పార్టీ కోల్పోతే, తాను తండ్రిని కోల్పోయానని,క‌ళాంజైర్‌ ఆశయాల కోసం కార్యకర్తలు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెరీనా బీచ్‌లో కరుణానిధి సమాధి ఏర్పాటు చేయాలన్నతన తండ్రి చివరి కోరికను ముఖ్యమంత్రి పళనిస్వామికి చెప్పానని,కానీ దానిని ఆయన తోసిపుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.డీఎంకే పార్టీలో స్టాలిన్,అళగిరిల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైన విషయం తెలిసిందే.కరుణ మృతి తర్వాత పార్టీ కార్యకర్తలతో తొలిసారి స్టాలిన్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా వారు మీరే పార్టీని న‌డిపించాల‌ని కోరారు.కేంద్ర మాజీ మంత్రి టీఆర్ బాలు మాట్లాడుతూ ఆర్మీ కమాండర్ (పార్టీ చీఫ్) చనిపోయారని,కాబోయే కమాండర్ ఎవరో చెప్పే హక్కు ఎవరికీ లేదని అళగిరిని ఉద్దేశించి అన్నారు.కేవలం స్టాలిన్‌కు మాత్రమే పార్టీని నడిపించే స‌త్తా ఉంద‌న్నారు.కరుణానిధి జీవించి ఉన్నప్పుడే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరంచారని కొందరు డీఎంకే నాయకులు గుర్తు చేసుకుంన్నారు.కాబట్టి డీఎంకే చీఫ్ ఎవరనేది ఇప్పటికే తేలిపోయిన అధ్యాయం మ‌ని,స్టాలిన్ మాత్రమే పార్టీ అధినేత అని చెబుతున్నారు.