జిల్లా వైద్యాశాఖాధికారి అవినితిలో కూరుకుపోయాడు-డాక్ట‌ర్‌.శంక‌ర్‌రావు..?

నెల్లూరుః పేద ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో,క‌నీస సౌక‌ర్యాలు లేకపోవ‌డంతో ఎస్సీ,ఎస్టీ,బిసి వర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు ప‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ప్ర‌భుత్వ డాక్ట‌ర్ శంక‌ర్‌రావు విమ‌ర్శించారు.ఈ విష‌యంపై అయ‌న మాట్లాడుతూ వైద్య‌శాఖ‌లోని కొంత మంది డాక్ట‌ర్లు విధుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తు,అవినితి సంపాద‌న‌లో మునిగిపోయార‌ని ఆరోపించారు.ఇందులో డి.ఎం అండ్ హెచ్‌.ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ర‌ని,దినిపై ఉన్న‌త‌స్దాయిలో విచార‌ణ జ‌రిపిస్తే నిజ‌లు బ‌య‌ట ప‌డతాయ‌న్నారు.ఈవిష‌యంపై డి.ఎం అండ్ హెచ్‌.ఓ వ‌ర‌సుంద‌రం న్యూస్‌19టివితో మాట్లాడుతూ డాక్ట‌ర్ శంక‌ర్‌రావు ప‌నికిరాని ఆరోఫ‌ణ‌లు చేస్తున్నార‌ని,అత‌నిపై ఆర్‌.డి.ఓ ఎంక్వ‌యిరీ వేసివున్న‌మ‌ని,రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్న‌మ‌న్నారు.ఇది నెల్లూరు జిల్లాలో వైధ్యాశాఖ పరిస్దితి దీనిపై అధికారుల ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..?