బాక్స్త్‌ట్ త‌వ్వ‌కాలు బంద్‌-డిప్యూటివ్ సీ.ఎం

విశాఖ‌ప‌ట్నంః ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ఖచ్చితంగా నెరవేరుస్తామని, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు లేకుండా చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రకటించారు.శ‌నివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇచ్చిన మాట తప్పమ‌ని, గిరిజనుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరించబోమ‌న్నారు.చంద్రబాబు లాగా ఆచరణ కానీ హామీలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవ్వరని,అక్టోబర్ నుండి రైతు భరోసా పథకం అమలు అవుతుందని స్ప‌ష్టం చేశారు.పేద ప్రజలకు ఇళ్లను కేటాయిస్తామ‌ని,కులం,మతం,పార్టీల భేదాలు లేకుండా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని వెల్లడించారు.మరోవైపు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి నేత‌లు,కార్య‌క‌ర్త‌లు శుభాకంక్షలు తెలిపారు.