వైద్యో నారాయ‌ణ హ‌రికి ఆర్దం మారింది-డాక్ట‌ర్ ఈదూరు..

0
181

నెల్లూరుః వైద్యో నారాయ‌ణ హ‌రి అని స‌మాజంలో మ‌రే వృత్తి నిపుణ‌ల‌కు ఇవ్వ‌ని గౌర‌వం డాక్ట‌ర్ల‌కు ఇచ్చిన ప్ర‌జ‌ల‌కు, నేటి రోజుల్లో కొంత మంది డాక్ట‌ర్లు త‌ప్ప మిగిలిన వారంద‌రు పేద‌,మ‌ధ్య‌త‌ర‌గ‌తి వర్గాల ప్ర‌జ‌ల‌ను దొచుకుతింటున్న‌ర‌ని డాక్ట‌ర్ ఈదూరు.సుధాక‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జూలై 1వ తేదిన జాతీయ డాక్ట‌ర్ల దినోత్స‌వం జ‌రుపుకుంటున్న సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ పంటి బిగువునా,నొప్పిని భ‌రిస్తు త‌న ద‌గ్గ‌ర‌కు వైద్యం కోసం వ‌చ్చేవారికి లేని రోగాలు అంట‌క‌ట్టి అడ్డంగా ఆర్దికంగా వారిని ఆప్పులోకి నేట్టివేయ‌డం వాంఛ‌నీయం కాద‌న్నారు.ఇప్పటికి స‌మాజంలో డాక్ట‌ర్ల ప‌ట్ల గౌర‌వం ఉందంటే,అది కొంత మంది ప్ర‌జా వైద్యుల వ‌ల్లే అని అన్నారు.
డాక్ట‌ర్స్ డేః–డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (80) 1882 జూలై 1 – 1962 జూలై 1,,, జయంతి మరియు వర్ధంతి అయిన జూలై ఒకటవ తేదీని భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవంగా పాటిస్తారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫిబ్రవరి 4, 1961లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం,భారతరత్న పురస్కారంతో సత్కరించింది.

LEAVE A REPLY