విద్యార్దులు ప్ర‌తిరోజు క్రీడలు సాధ‌న చేయాలి-డి.ఎస్‌.డి.ఓ సుబ్ర‌మ‌ణ్యం

0
135

ముగిసిన వేసవి శిక్షాణా శిబిరాలు
నెల్లూరుః నెల రోజుల‌పాటు శిక్ష‌ణా శిబిరాల్లో క్రీడాకారులు నేర్చుకున్న క్రీడామెళ‌కువ‌ల‌ను కొన‌సాగించి మ‌రింత సాధ‌న చేసి రాబోవు రోజుల్లో రాష్ట్ర,జాతీయ స్దాయి,అంత‌ర్జాతీయ స్దాయి క్రీడాకారులుగా ఎద‌గాల‌ని సెట‌నల్ మ‌రియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్ద అధికారి సి.సుబ్ర‌మ‌ణ్య అన్నారు.గురువారం స్దానిక ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో వేసవి శిక్ష‌ణా శిబిరాల ముగింపు కార్యాక్ర‌మంలో అయ‌న ముఖ్య అతిధిగా పాల్గొని క్రీడాకారుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ వేస‌వి శిక్ష‌ణా శిబిరాలఅనంత‌రం విద్యార్దులు ప్రతిరోజు సాధ‌న చేసి మంచి క్రీడాకారులుగా ఎద‌గాల‌ని అకాంక్షించారు.జిల్లా వ్యాప్తంగా 34 గ్రామీణ ప్రాంతాల్లో,16 జిల్లా కేంద్రాల్లో,ఏసి సుబ్బ‌రెడ్డి స్టేడియంలో 10 శిబిరాలతో క‌ల‌సి మొత్తం 60 శిబిరాలు నిర్వ‌హించామ‌ని,ఇందులో 16 క్రీడల‌కు సంబంధించి దాదాపు 2500 మంది విద్యార్దులు శిక్ష‌ణా పొందారన్నారు.శిక్ష‌ణ శిబిరాల్లో పాల్గొన్న విద్యార్దుల‌కు ప్ర‌శంస ప్ర‌తాలు అంద‌చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో చీఫ్‌కోచ్ పి.వి ర‌మ‌ణ‌య్య‌,జిల్లా ఒలింపిక్ కోశాధికారి పి.రామ‌మూర్తి,వివిద క్రీడల కోచ్‌లు,జిల్లాక్రీడాప్రాధికారి సంస్ద అధికారి విజ‌య‌కుమార్,పిఇటిలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY