పాత క‌క్ష్య‌ల‌తో యువ‌కుడి హ‌త్య

0
145

నెల్లూరుః పాత క‌క్ష్య‌ల‌తో యువ‌కుడుని దారుణంగా హ‌త్య చేసిన సంఘ‌ట‌న నెల్లూరు ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది.సిటి డిస్పీ ముర‌ళీకృష్ణ తెలిపిన క‌థ‌నం మేర‌కు 2 టౌన్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని వెంక‌టేశ్వ‌ర‌పురం వద్ద వున్న స‌ప్త‌గిరి బార్ అండ్ రెస్టారెంట్ వ‌ద్ద శ‌నివారం పాత క‌క్ష‌లు మ‌న‌స్సులో వుంచ‌కుని గ‌ణేష్‌,ఆమ‌ర్‌లు ఇద్ద‌రు క‌ల‌సి బ‌స్టాండ్ శీనుతో మ‌ద్యం సేవించినంత‌రం గొడ‌వ‌కు దిగారు.వారి మ‌ధ్య మాట మాట పెర‌గ‌డం,పాత క‌క్ష‌ల మ‌న‌స్సులో వుంచుకుని అత‌నిపై క‌త్తుల‌తో దాడి చేశారు.బార్ బ‌య‌ట‌కు వ‌చ్చిన అత‌నిపై మ‌ళ్లీ బీరు సీసాల‌తో త‌ల‌పై కొట్టి,అక్క‌డి నుండి ప‌రారీ అయ్యార‌న్నారు.స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్ద‌లంకు చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లిస్తున్న స‌మ‌యంలో అత‌ను మ‌ర‌ణించాడ‌ని తెలిపారు.కేసు న‌మోదు చేసుకుని ద‌ర్య‌ప్తు చేస్తున్నమ‌న్నారు.

LEAVE A REPLY