రూ.2.5 కోట్ల విలువ‌చేసే ఎర్ర‌చంద‌నం,వాహ‌నాలు స్వాధీనం-విఠలేశ్వ‌ర్‌

0
122

నెల్లూరుః జిల్లా వ్యాప్తంగా కోవూరు,గూడూరురూర‌ల్‌,బిట్ర‌గుంట‌,ఉద‌య‌గిరి క‌లువాయి పోలీసులు,టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, సంయుక్తంగా 5 స్టేష‌న్స్ ప‌రిధిలో 19వ తేదిన దాడులు నిర్వ‌హించి 17 మంది అంత‌రాష్ట్ర స్మ‌గ్ల‌ర్స్‌తో పాటు కోటి రూపాయ‌ల విలువ‌చేసే ఎర్ర‌చంద‌నం,4 లారీలు,2 కార్లు,1ట్ర‌క్కుఆటో,1 ట్రాక్ట‌ర్‌,5 మోటార్ సైకిల్స్‌,24 సెల్‌ఫోన్స్‌,17,400 న‌గ‌దును స్వాధీనం చేసుకున్నమ‌ని జిల్లా క్రైమ్ ఓఎస్డీ విఠ‌లేశ్వ‌ర్ తెలిపారు.బుధ‌వారం పోలీసు పేరేడ్‌గ్రౌండ్స్‌లోని ఉమేష్‌చంద్ర కాన్ప‌రెన్స్‌హాల్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ ముందుగా అందిన‌ స‌మాచారం మేర‌కు పోలీసులు దాడులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో నిందితులు వాహ‌న‌ల‌తో పోలీసుల‌ను ఢీ కొట్టి,హ‌త్య‌య‌త్నంకు ప్ర‌య‌త్నించిన కోవూరు పి.ఎస్ ప‌రిధిలో 3గురు,గూడూరురూర‌ల్ పి.ఎస్ ప‌రిధిలో4గురు,బిట్ర‌గుంట పి.ఎస్ ప‌రిధిలో 3గురు,ఉద‌య‌గిరి పి.ఎస్ ప‌రిధిలో 3గురు,క‌లువాయి పి.ఎస్ ప‌రిధిలో 4గురిని ఆదుపులోకి తీసుకుని 45 ఎర్ర‌చంద‌నం దుంగ‌లు,వాహ‌న‌లు స్వాధీనం చేసుకొవ‌డం జ‌రిగింద‌న్నారు.అరెస్ట్ అయిన వారిలో 8 మంది క‌డ‌ప‌జిల్లా,6మంది ప్ర‌కాశంజిల్లా,మిగిలిన 3గురు త‌మిళ‌నాడుకు చెందిన వారిగా గుర్తించ‌డం జ‌రిగింద‌ని,వీరంద‌రు గ‌త కొంత‌కాలంగా ముందుస్తు ప్ర‌ణాళిక‌తో వెలిగొండ అట‌వీ ప్రాంతంలో దుంగ‌ల‌ను న‌రికించి, చెన్నైకు,అక్క‌డి నుండి వివిధ దేశాల‌క ఆక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న‌ర‌న్నారు.త‌నిఖీల్లో మోస్ట్‌వాంటెండ్ స్మ‌గ్ల‌ర్స్‌ అయిన బ‌త్త‌ల‌.కిశోర్‌కుమార్ (క‌డ‌ప‌-గంగిరెడ్డి & రామ‌నాథ‌రెడ్డి స‌హ‌చ‌రుడు),వ‌నం.చెన్న‌య్య‌(బ‌ద్వేల్‌),ఇడ‌గొట్టు.శేషు (మైదుకూరు), బోడి.నాగ‌రాజు(కావ‌లి & మార్క‌పురం) పోలీసు ఇన్‌-ఫార్మ‌ర్ పేరుతో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్స్‌ను బెదిరించి వ్యాపారం చేస్తున్న‌డ‌ని చెప్పారు.వీరితో పాటు గిద్ద‌లూరు ఫారెస్ట్ రేంజ్ చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీస‌ర్ ఒక‌రు ప‌ట్టుబ‌డ‌డం జరిగింద‌ని తెలిపారు.ఎర్ర‌చంద‌నం స్మ‌గ‌ర్ల‌పై చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లుతీసుకోవ‌డంతో పాటు స్మ‌గ్ల‌ర్స్‌ ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంటామ‌ని,పి.డి.యాక్ట్ క్రింద ప్ర‌ధాన ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్స్‌పై చ‌ర్య‌లు తీకొవ‌డం జ‌రుగుతుంద‌న్నారు.దాడుల్లో ఎస్‌.ఐలు వెంక‌ట‌రావు, బాబీ,నాగ‌భూష‌ణం, ప్ర‌భాక‌ర్‌, సైదులు వారి సిబ్బంది పాల్గొన్న‌ర‌న్నారు.

LEAVE A REPLY