ఫ‌స్ట్ ఇయ‌ర్ మెడికో ఆత్మ‌హ‌త్య ?

0
106

కర్నూలుః క‌ర్నూలు ప‌ట్ట‌ణంలోని మెడికల్ కాలేజీ హాస్టల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది.తన గదిలో రూమేట్స్‌ లేని సమయంలో కొమ్మ. ప్రణీత్‌హర్ష అనే MBBS మొదటి సంవత్సరం చదువుతున్నవిద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రణీత్‌హర్ష,కడప జిల్లా అరవింద్ నగర్‌ వాసి.ప్రణీత్ మృతిపై ఆయన తండ్రి రామాంజులురెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారంటూ ప్రణీత్ తనకు పలుమార్లు చెప్పాడని ఆయన తెలిపారు.మెడిక‌ల్ కాలేజ్‌లో ఇలాంటివి స‌హజ‌మేన‌ని,చదువు దృష్టి పెట్టాల‌ని తాను సూచించినట్లు తెలిపారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని,తన కుమారుడిని కొట్టి చంపారని ప్రణీత్ తండ్రి రామాంజులు రెడ్డి ఆరోపించారు.కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌తో ఘటనపై ఆయన వాగ్వాదానికి దిగారు.కనీసం తనకు ఘటనపై సమాచారం ఇవ్వలేదంటూ యాజమాన్యంపై మండిపడ్డారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

LEAVE A REPLY