ప‌నిచేస్తున్న దుకాణంలోనే 10 కేజి బంగారం చోరీ

0
134

నెల్లూరుః సొంత‌గా బంగారు షాపు ప్రారంభించాల‌న్న కోరిక‌తో,మండ‌ల‌పాల‌వీధి ప్రాంతంలో తాను ప‌నిచేస్తున్న భ‌వ్య‌జువెల‌రిలో 3 సంవ‌త్స‌రాల నుండి దాదాపు 10 కేజిల బంగారంను (దాదాపు రూ.3 కోట్లు) దొంగలించిన మేనేజ‌ర్ దినేష్‌కుమార్‌సోని (35) అరెస్ట్ చేసిన‌ట్లు జిల్లా క్రైమ్ ఓఎస్డీ విఠ‌లేశ్వ‌ర్ తెలిపారు.శుక్ర‌వారం స్దానిక సంత‌పేట (3వ ప‌ట్ట‌ణ‌పోలీసు స్టేష‌న్‌)లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ నిందితుడు ప‌నిచేసే దుకాణంలో వీలు దొరిక‌న‌ప్ప‌డ‌ల్లా కొంత బంగారం క‌డ్డీల రూపంలో దొంగ‌లించి ఇంటిలో దాచేవాడ‌న్నారు.ఇత‌నిపై అనుమాన క‌ల‌గ‌డంతో నిఘా ఏర్పాటు చేసి,శుక్ర‌వారం ఉద‌యం స్దానిక మూలుముడి బ‌స్టాండ్ సెంట‌ర్‌లో ఆరెస్ట్ చేసి 10 కేజిల బంగారం స్వాధీనం చేసుకొవ‌డం జ‌రిగింద‌న్నారు.చోరీ ఘ‌ట‌న‌ను డిస్సీలు బాల‌సుంద‌ర‌రావు, ముర‌ళీకృష్ణ‌,ఆధ్వ‌ర్యంలో క్రైమ్ సి.ఐ బాజీజాన్‌సైదా, బి.పాపారావు,క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్స్ కె.గిరిధ‌ర్‌రావు, జె.సురేష్‌బబు,పి.వెంక‌టేశ్వ‌ర్లు,పి.సి ర‌మేష్‌,సి.హెచ్.శ్రీనివాసులు దర్యాప్తుచేసి కేసును చేధించార‌న్నారు.

LEAVE A REPLY