మ‌రో ఎర్ర‌మందారంను కోల్పోయిన నెల్లూరు జిల్లా

0
104

అమ‌రుడైన కామ్రేడ్‌.జ‌క్కా.వెంక‌య్య‌.
నెల్లూరుః నెల్లూరు జిల్లా మ‌రో ఎర్ర‌మందారంను కోల్పోయింది.జిల్లా క‌మ్యూనిస్ట్‌పార్టీ చ‌రిత్రలో త‌న‌కంటు ఒక ప్ర‌త్యేక గుర్తింపు పొందిన, కార్మికుల,రైతుల‌ ప‌క్ష‌పాతి జ‌క్కా.వెంకారెడ్డి(88) ఆనారోగ్య‌కార‌ణంతో స్దానిక హాస్ప‌ట‌ల్ చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం తుది శ్వాస విడిచారు.1930 న‌వంబ‌ర్ 3వ తేదిన నెల్లూరు జిల్లా దామ‌ర‌మ‌డుగులో జ‌క్కా.వెంక‌ట‌ర‌మ‌ణ‌రెడ్డి,శంక‌ర‌మ్మ‌ల‌కు వెంక‌య్య జ‌న్మించారు.అయ‌న‌కు యుక్త వ‌య‌స్సు వ‌చ్చిన‌ప్ప‌టి నుండి క‌మ్యూనిస్ట్ భావ‌ల ప‌ట్ల ఆక‌ర్షించ‌బ‌డి,1948 నుండి 1951 వ‌ర‌కు క‌మ్యూనిస్ట్ పార్టీపై నిషేధం వున్న రోజులో పార్టీకి సంబంధించి నాయ‌కుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. 1951లో పార్టీలో స‌భ్య‌త్వం తీసుకున్నారు.1957 నుండి 1964 వ‌ర‌కు దామరామ‌డుగు స‌ర్పంచ్‌గా ప‌నిచేశారు.1972లో అల్లూరు నియోవ‌ర్గం నుండి సిపిఎం త‌ర‌పున ఎమ్మేల్యేగా కాంగ్రెస్ అభ్య‌ర్ది రేబాల‌.ధ‌శ‌రాధ‌రామిరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.1985లో అల్లూరు నుండి అభ్య‌ర్ది రేబాల‌.ధ‌శ‌రాధ‌రామిరెడ్డిపై గెలిచారు.1989లో కాటంరెడ్డి.విష్టువ‌ర్ద‌న్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.1993లో కోవూరు బై ఎల‌క్ష‌న్‌లో పోటీ చేసి ఓడిపోయారు.1994లో కాటంరెడ్డి.విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డిపై గెలిచారు.జిల్లా నీటిపారుద‌ల‌పై మంచి ప‌ట్టు వున్న వెంక‌య్య‌కు రబీ,ఖ‌రీఫ్ సీజ‌న్‌లో ఏ కాలువ ద్వారా ఏ ప్రాంతానికి ఎంత నీరు విడుద‌ల చేస్తే పంట‌ల‌ను పండించుకోగ‌ల‌ర‌ని నోటి లెక్క‌ల‌తో చెప్ప‌గ‌లగ‌డంతోపాటు,జిల్లాలో నీటి ఎద్దడి వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలహాలు ఇచ్చే వ్య‌క్తి జ‌క్కా.వెంక‌య్య‌.ఈనెల మే1వ తేదిన పార్టీ కార్య‌క్ర‌మంలో పాల్గొని,పుచ్చ‌ప‌ల్లి సుంద‌ర‌య్య‌కు నివాళ్ళిఆర్పించారు. వ‌య‌స్సు స‌హ‌క‌రించక‌పోయిన‌,శ‌రీరం శ‌క్తి వున్నంత వ‌ర‌కు పార్టీ కార్యాల‌యంలో కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో వుండే వున్న‌తమైన వ్య‌క్తి ఈ ఎర్ర‌మందారం.కమ్యూనిస్ట్‌పార్టీ కార్య‌క‌ర్త‌లు,నాయ‌కులు కామ్రేడ్ జక్కా.వెంక‌య్య‌కు జోహ‌ర్లు తెలియ‌చేశారు.

LEAVE A REPLY