ఈనెల 18న ఛ‌లో విజ‌య‌వాడ‌

0
72

నెల్లూరుః నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ఈనెల 18న విజ‌య‌వాడ‌లోని సి.ఎం క్యాంప్ కార్యాల‌యంలో వ‌ద్ద నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ధ‌ర్నాకు నిరుద్యోగులు త‌ర‌లి రావాలిని డి.వై.ఎఫ్‌.ఐ రాష్ట్ర అధ్య‌క్ష‌డు రామ‌న్న పిలుపునిచ్చారు.మంగ‌ళ‌వారం స్దానిక బాలాజీన‌గ‌ర్‌లోని రామ‌చంద్రరెడ్డి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ధ‌ర్నాకు సంబంధించిన వాల్‌పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసినంత‌రం అనంత‌రం అయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో యువ‌త‌కి అనేక హామీలిచ్చి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు,హామీల‌ను అమ‌లు చేయ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యార‌ని,జాబు కావాంటే బాబు రావాల‌ని చెప్పి,తీరా అధికారంలోకి వచ్చిక వాళ్ల బాబు లోకేష్‌కు ఉద్యోగం ఇచ్చేడే త‌ప్ప నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఇవ్వాలేద‌ని విమ‌ర్శించారు.అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వ‌లేద‌ని,రాష్ట్రంలో ఖాళీగా వున్న 2.21 ల‌క్ష‌ల పోస్టులు,ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు.ఈ స‌మావేశంలో డి.వై.ఎఫ్‌.ఐ జిల్లా అధ్య‌క్ష‌డు బాసుబ్ర‌మ‌ణ్యం,న‌గ‌ర అధ్య‌క్ష‌,కార్య‌ద‌ర్శులు ఫ‌యాజ్‌,ప్ర‌సాద్‌,ఎ.ఐ.వై.ఎప్‌.ఐ జిల్లా కార్య‌ద‌ర్శి లీలామోహ‌న్,సునీల్ నాగేంద్ర‌,బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY