రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కై కేంద్రం చ‌ట్టం తీసుకునిరావాలి-వెంక‌టేశ్వ‌ర్లు

0
83

నెల్లూరుః స్వామినాథ‌న్ క‌మిటీ సిపార‌సుల మేర‌కు రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌కై కేంద్రం చ‌ట్టం తేవాల‌ని,పంట‌ల భీమాలోని లోపాల‌ను స‌వ‌రించిన అన్ని పంట‌ల‌కు వ‌ర్తింప‌చేయాల‌ని,చిన్నమ‌ధ్య‌త‌రగ‌తి రైతుల ప్రీమియం మొత్తం కేంద్ర‌మే చెల్లించాల‌ని ఎ.పి రైతు,వ్య‌వ‌సాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్య‌ద‌ర్శి వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్ చేశారు.గురువారం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ముందు కేంద్ర ప్ర‌భుత్వం రైతాంగ వ్య‌తిరేక విధానాల‌కు నిర‌స‌న‌గా నిర్వ‌హించిన ధ‌ర్నా కార్యాక్ర‌మంలో అయ‌న పాల్గొని మాట్లాడుతూ కేర‌ళ రాష్ట్రంలోలాగా రుణ‌విముక్తి చ‌ట్టం అన్ని రాష్ట్రల్లో అమ‌లు జ‌రిగేలా కేంద్ర చ‌ట్టం చేయాల‌న్నారు.60 సంవ‌త్స‌రాలు దాటిన పేద‌,చిన్న‌రైతుల‌కు 5 వేల రూపాయ‌లు పెన్ష‌న్ ఇవ్వాల‌ని కోరారు.2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం య‌ధాత‌ధంగా అమలు చేయాల‌ని,కేర‌ళ రాష్ట్ర ఇచ్చిన‌ట్లుగా ధాన్యానికి క్వింటాలుకు రూ.2352 ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.కోవూరు షుగ‌ర్‌ఫ్యాక్ట‌రీ కార్మికుల బకాయిలు వెంట‌నే చెల్లించాల‌ని,సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా స‌మాన ప‌నికి-స‌మాన వేత‌నం ఇవ్వాలన్నారు.ఈ ధ‌ర్నాలో ఎ.పి కౌలురైతు సంఘం,సి.ఐ.టి.యు త‌దిత‌రు సంఘ‌లు,నాయ‌కులు పాల్గొన్నారు.

LEAVE A REPLY