రాష్ట్రంలో రాజ‌కీయంగా కొత్త మార్పులు జ‌ర‌గాలి-రామ‌కృష్ణ‌

0
75

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్‌లో రాజ‌కీయంగా విచిత్ర ప‌రిస్దితులు నెల‌కొన్న‌య‌ని, తెలుగుదేశంపార్టీ, వైకాపాలు రాజకీయంగా మ‌రో పార్టీ ఎద‌గ‌కుండా ఆధిపత్యంతో చెలాయిస్తున్న‌య‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.ఈ రెండు పార్టీలే ప్రజలను నిర్దేశించే పరిస్థితి ఉండకూడదని అభిప్రాయ‌ప‌డ్డారు.ఈ బైపోలార్‌ సిస్టమ్‌ను బద్దలుకొట్టాలని,అలా చేయకుంటే రాష్ట్రంలోవామపక్ష పార్టీలు ఎదగడానికి వీలుకాదని అన్నారు.కూటమి,మహాకూటమి అనే పేర్లు మేము పెట్టలేదని,ఈనెల 20న విజయవాడలో ఓ అజెండా రూపొందించి పలు పార్టీలకు పంపించామ‌న్నారు. ఆ పార్టీల్లో జనసేన,లోక్‌సత్తా,సీపీఐ,బహుజన్‌ సమాజ్‌ పార్టీతో పాటు పలుపార్టీలు ఉన్నాయ‌ని,రాష్ట్రంలో ఇలాంటి పార్టీలన్నింటినీ కూడగట్టి ముందుకు వెళ్లెందుకు త్వరలోనే సదస్సులు ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.కార్మికుల సమస్యలపై విశాఖపట్నంలో, రైతుల సమస్యలపై గుంటూరులో,విద్యార్థుల సమస్యలపై తిరుపతిలో,మైనార్టీల సమస్యలపై కర్నూలులో,మహిళల సమస్యలపై అనంతపురంలో అన్ని వర్గాల సమస్యలపై పలు ప్రాంతాల్లో చర్చలు జరుపుతామ‌ని, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తు సెప్టెంబరు 15న విజయవాడలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఓ అజెండాను ప్రజల ముందుకు తీసుకెళతామ‌న్నారు.జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూడా ఈ విషయంలో స్పష్టత ఉందని,మేమందరమూ కలిసి ముందుకు వెళ్ల‌డం జ‌రుగుతుంద‌న్నారు. వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ ఇటీవల వైసీపీతో పవన్‌ కలుస్తారని అన్న తరువాత నేను పవన్‌తో మాట్లాడానని, పవన్‌ మేము రూపొందించిన అజెండా ప్రకారమే ముందుకు వెళ్లాలన్న స్పష్టతతో ఉన్నారన్నారు.టీడీపీ, వైసీపీ నేతలు డబ్బులతో రాజకీయాలు చేస్తున్నారని దింతో డబ్బున్నవాడే ఎమ్మెల్యే అవుతున్నాడని,ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో తొల‌గిపోవ‌ల‌న్నారు. ఉభయ కమ్యూనిస్టుల పార్టీలు పవన్‌ కల్యాణ్‌తో చేతులు కలిపాయని,జనసేనతో మేము ముందుకు వెళతామ‌ని చెప్పారు.

LEAVE A REPLY