వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం దక్కే అవకాశమే లేదు-మ‌ధు

0
126

క‌డ‌పః ఇన్నిరోజుల పాటు ప్రత్యేకహోదా అంటే ఎగతాళి చేసిన చంద్రబాబుకు,ఈరోజున అదే నినాదం తీసుకుంటే తప్పమనుగడ సాధించలేని పరిస్థితి వుంద‌ని సిపిఎం నేత మ‌ధు విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం దక్కే అవకాశమే లేదని సీపీఎం నేత మధు జోస్యం చెప్పారు.ఆదివారం కడపలో సీపీఐ 26వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో భాగంగా ప్రతినిధుల సమావేశంలో జరిగింది.ఈ సమావేశానికి సీపీఐ నేతలు సురవరం సుధారకర్ రెడ్డి, రామకృష్ణ, చాడ వెంకటరెడ్డి,నారాయ‌ణ‌, సీపీఎం నేత‌ మధు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలకు బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలు తీవ్ర నష్టం కలిగించాయని ఆరోపించారు.ప్ర‌త్యేక హోదా కోసం ఉద్య‌మ‌లు చేసిన వారిపై కేసులు పెట్టించి,జైళ్ల‌కు పంపిన చంద్ర‌బాబు అఖిలప‌క్షంమంటు మాట్లాడ‌డం విడ్డూరం కాక మారేమిట‌ని ప్ర‌శ్నించారు.
ఏపీ అంటే అమరావతి, పోలవరంమే కాదు-రామ‌కృష్ణః-ఏపీలో కార్పొరేట్లకు అనుకూలంగా పరిపాలన సాగుతోందని, ఏపీ అంటే అమరావతి, పోలవరం కాదని ఏపీ అంటే అనంతపురం టూ పార్వతీపురం అనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరిస్తూ, వెనుకబడిన ప్రాంతాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర మహాసభల్లో పీపుల్స్ అజెండా పెడతామని, చంద్రబాబు, జగన్ పరస్పర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఏపీకి నిజంగా హోదా సాధించాలను చిత్తశుద్ధి కనుక ఉంటే అందరినీ కలుపుకోవాలని రామకృష్ణ సూచించారు.

LEAVE A REPLY