ఏ.సి.బి కి పట్టుబడిన అవినితి  బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌-ఉగాండలో బ్యాంక్ అకౌంట్

కర్నూలు: అవినితి సోమ్మును దాచిపెట్టుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగులు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు.ఇందుకు ఉదహారణ కర్నూలు జిల్లా మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ ఏ.సి.బి అధికారులకు చిక్కడంతో విషయాలు బయటపడ్డాయి..శివప్రసాద్ కు ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారన్న సమాచారంతో గురువారం ఆయన ఇంటిపై అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.కర్నూలు సహా హైదరాబాద్‌,బెంగళూరులోని రెండు ప్రాంతాలు,తాడిపత్రిలో ఏకకాలంలో సోదాలు సాగుతున్నాయి.ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ సంపాదన కూడబెట్టినట్లు లెక్కలుతేల్చారు.బెంగళూరులో అపార్ట్‌మెంట్‌తోపాటు హైదరాబాద్‌లో మరో భవనం,కర్నూల్‌లోని ఇంట్లో కేజీకిపైగా బంగారాన్ని అధికారులు గుర్తించారు.అలాగే ఉగాండా దేశంలో బ్యాంక్‌ అకౌంట్‌,హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో లాకర్‌ ఉన్నట్లు గుర్తించారు.భార్య పేరు మీదు శివప్రసాద్‌ రెండు సూట్‌ కేసు కంపెనీలను నడుపుతున్నట్లు ఏసీబీ అధికారులు తనిఖీల్లో బయటపడింది.శివప్రసాద్ అక్రమాస్తుల జాబిత అంతక అంతకు పెరిగి పోతుడడంతో అధికారలు సోదాలను ముమ్మరం చేశారు.పూర్తి ఆక్రమ సంపాదన బయట పడేందుకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది ??