మేయరు-కమీషనర్ జ‌ట్ల మ‌ధ్య‌ క్రికెట్ మ్యాచ్‌

0
94

నెల్లూరుః మున్సిపల్ పాఠ‌శాలల క్రీడోత్సవాలను పురస్కరించుకుని శుక్ర‌వారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మేయరు, కమీషనరు జట్ల మధ్య క్రికెట్టు పోటీను నిర్వహించారు.మేయరు జట్టులో వివిధ డివిజనులకు చెందినా కార్పొరేటర్లు పాల్గొనగా, కమీషనరు జట్టులో కార్పోరేషను అధికారులు ఆడారు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ పది ఓవ‌ర్ల‌ మ్యాచులో టాసు గెలిచి బ్యాటింగు ఎంచుకున్న కమిషనరు జట్టు మొత్తం పది ఓవర్లకు 53 పరుగులు సాధించింది. రెండవ సారి బరిలోకి దిగిన మేయరు జట్టు నిర్దేశిత లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది. మేయరు బౌలింగులో ఒకే ఒవరులో రెండు కీలక వికెట్లను పడగొట్టి జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఉత్సాహంగా సాగిన ఇరు జ‌ట్ల బ్యాటింగును విద్యార్ధులు ఆసక్తిగా వీక్షించారు.

LEAVE A REPLY