కొత్త ప‌ద్ద‌తిలో లంచం తింటున్న అవినితి పందికొక్కు

విశాఖప‌ట్నంః వైజాగ్‌లో ఏసీబీ అధికారుల ఉహాకు సైతం అంద‌ని అవినీతి పందికొక్కు చిక్కింది. రూ.2కోట్ల లంచం తీసుకుంటూ సహకార శాఖ రిజిస్ట్రార్ మోషా మంగ‌ళ‌వారం అవినీతి నిరోధక శాఖ అధికారుల బొనులో చిక్కుకున్నాడు.లబ్ధిదారుడి వద్ద రూ.2కోట్ల లంచం డిమాండ్‌ చేసి అడ్డంగా దొరికిపోయాడు.ఈ అవినితి పందికోక్కు,,వివాదంలో వున్న భూముల‌పై ప్ర‌భుత్వం విచార‌ణ అధికారిగా మోషాను నియ‌మించింది. విష‌యంను త్వ‌రంగా తేల్చ‌కుండా నానుస్తు వ‌స్తున్న మోషా,,,తానకు క‌నీసం 2 కోట్ల రూపాయ‌ల లంచం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.అంత మొత్తం స‌ర్ద‌లేనని చెప్పిన ల‌బ్దిదారులు,ఈ మొత్తానికి సరిపోయే విలువైన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని చెప్పడంతో ఇరువురి మధ్యా అంగీకారం కుదిరింది.ఈ అవినితి పందికొక్కు,,ప్ర‌త్య‌క్షంగా ముందుకు రాకుండా,,త‌న త‌మ్ముడు మల్లికార్జునరావు పేరున భూమి రిజిస్ర్టేష‌న్‌ను విశాఖ టర్నర్‌చౌల్ట్రీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద జ‌రిగే విధంగా ఒప్పందం చేసుకున్నారు.స‌మాచారం అందుకుని,, రిజిస్ట్రేషన్‌ పక్రియ జరుగుతున్న సందర్భంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నారు.సబ్‌ రిజిస్ట్రార్‌కార్యాలయం వద్ద ఏసీబీ డీఎస్పీ రంగరాజు ఆధ్వ‌ర్యంలో ఈ దాడులు జ‌రిగాయి.