సహకార సంఘలను లాభాల బటలో నడిపిస్తాం-పవన్

విశాఖపట్నం: ప్రజలకు సేవా చేయాలని,వారి జీవితాల్లో మార్పు తీసుకుని వచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చే వారిని అడ్డుకునేందుకు అధికార,ప్రతిపక్షపార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.దిని వల్ల  మంచితనం ఉన్నవాళ్లు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం అనకాపల్లిలో NTR groundsలో జనసేన ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడుతూ జనసేన తరుఫున బలమైన అభ్యర్థులను నిలబెట్టామని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే అనకాపల్లిని స్మార్ట్ సిటీగా మారుస్తామని పవన్ హామీ ఇచ్చారు. అక్రమ క్వారీలను అరికట్టేలా చూస్తామని, క్వారీల వల్ల వచ్చే కాలుష్యం తగ్గిస్తామని మాట ఇచ్చారు.ప్రభుత్వం సహకార సంఘాలను చంపేసి ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తుందని,దిని తాము అడ్డుకుంటామని తెలిపారు.విశాఖ డెయిరీని మూసేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. విశాఖ డెయిరీ స్థలాలు కబ్జా కాకుండా కాపాడతామన్నారు.ఉత్తరాంధ్రలో 16 నదులున్నా నీటి సమస్యలు ఎందుకు వస్తున్నాయని పవన్ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే తుమ్మలపాల షుగర్ ఫ్యాక్టరీని లాభాల బాట పట్టిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు జనసేన అండగా ఉంటుందన్నారు.ప్రతిపక్షంగా వైసీపీ విఫలమైందని పవన్ విమర్శించారు. జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఓట్ల కోసమే చివరి నిమిషంలో బీజేపీ రైల్వే జోన్ ఇచ్చిందని పవన్ మండిపడ్డారు.