యువజన కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ శ్రీకారం-ప్ర‌దీప్‌

0
170

ప‌శ్చిమ‌గోదావ‌రిః కాంగ్రెస్ యువ నాయకులు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ పటిష్టమవౌతుందని పూర్వ తీసుకోచ్చేందకు కార్యకర్తలు యువజన నాయకులు శ్రమించి ముందకు తీసుకువెళ్లాలని ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఏపి ఇన్ ఛార్జ్ ఒట్ల వరప్రసాద్ అన్నారు. ఏలూరులో అదివారం రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి ప్రదీప్ ఆధ్వర్యంలో ఏలూరు డిసిసి కార్యాలయంలో ఫ్రీ మెంబర్ షిప్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశంలో యువజన కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టామన్నారు.మొన్న జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుతో ప్రజలు బిజెపి కి ముచ్చెమటలు పట్టించరన్నారు. దినిలో భాగంగా కష్టంచి పనిచేసే యువజనలకు గతంలో ఉన్న సంప్రదాయలకు స్వస్తి చెప్పి వినూత్న రీతిలో రాహుల్ గాంధీ ఎవరైతే క్రీయశీలకంగా పార్టీ కి పనిచేస్తారో వారికి అవకాశం కల్పించే విధంగా సరికొత్త పద్దతకిి శ్రీకారం చుట్టామన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో ఫ్రీ మెంబర్ షిప్ లాంచ్ ఏర్పాటు చేసి ఉత్సాహ వంతమైన యువకుల నుంచి నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించేమన్నారు. ముఖ్యంగా యువతకు మూడు స్ధాయిలో ఎన్నుకోవటం జరుగుతుందన్నారు.దినిలో అసెంబ్లీ , రాష్ట్ర, జిల్లా స్ధాయి కమీట్లో స్ధానం కల్పిస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీలకు 12.5 రిజర్వేషన్లు కల్పించినట్లు అయన తెలిపారు. దేశ ప్రజలు బాగుకోసం డాక్టర్ బీ .ఆర్ అంబేద్కర్,ఇందిరా,రాజీవ్ గాంధీలు ఆశయాల మేరకు పనిచేయాల్సి ఉందన్నారు. వీరికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అన్నారు. ఈ నెల 28 తేదిన విజయవాడలో నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ను ఏపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ప్రారంభిస్తారని అయన తెలిపారు. భారతదేశ ప్రజలు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రావాలని దేశంలోని అన్ని వర్గాలు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈ సమావేశంలో పాల్గోన్నవారు రఫీఉల్లా భేగ్ , సిటి అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సుబ్బారావు, కమ్ముల కృష్ణ,ఆడపా రాజేష్, బోడ్డేపల్లీ చంద్రశేఖర్, బడే సతీష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY