రెవెన్యూ అధికారుల పని తీరు బాగాలేదు-క‌లెక్ట‌ర్

0
137

నెల్లూరుః రెవెన్యూ ప‌నుల పురోగ‌తిలో అల‌స‌త్వం వ‌హించిన అధికారుల‌పై క్ర‌మశిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్.ముత్యాల‌రాజు పేర్కొన్నారు.బుధ‌వారం క్యాంపు కార్యాల‌యంలో 22-ఎ,చుక్క‌ల‌భూములు,ప్యూరిఫికేష‌న్ ఆఫ్ ల్యాండ్‌రికార్డ్స్‌,మీభూమికి భ‌రోసా,హౌసింగ్‌,త‌దిత‌ర అంశాల‌పై కొడ‌వ‌లూరు,బుచ్చిరెడ్డిపాళెం,నెల్లూరు మండ‌లాల‌కు సంబంధించి రెవెన్యూ అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల తీరు బాగాలేద‌ని మెరుగురు ప‌ర్చుకోక‌పోతే తీవ్ర‌మైన చ‌ర్య‌లు వుంటాయ‌ని హెచ్చిరించారు.ఇటీవ‌ల ఏప్రియ‌ల్ 24 నుండి మే 31 వ‌ర‌కు మీ భూమికి భ‌రోసా క్షేత్ర‌స్దాయిలో గ్రామ‌స‌భ‌లు ఏర్పాటు చేసిన‌ప్ప‌డు,రెవెన్యూ అధికారులు ప‌నులు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌లేద‌న్నారు.డాటెడ్ ల్యాండ్ ఆర్జీదారుల‌కు 30 రోజుల్లో నోటీసులు ఇచ్చి విచారించాల‌న్నారు.రైతుల భూమికి భ‌రోసా ఇచ్చేదానికి సూచ‌న‌లు జారీ చేశారు.రైతుకు ఒక ఖాతా నెంబ‌రు వుండాలి,ఒక‌టి కంటే ఎక్కువ ఖాతాలు వుంటే ర‌ద్దుచేసి ఒకే నెంబరు కేటాయించాల‌న్నారు.అనుభ‌వ‌దారు,ప‌ట్టాదారు ఒకే రైతు అయితే వారికి నోష‌న‌ల్ ఖాతాలో తొల‌గించి రెగ్యుల‌ర్ ఖాతాలు ఇవ్వాల‌న్నారు.వెబ్‌ల్యాండ్ చేసేట‌ప్పుడు అన్ని రికార్డుల‌ను త‌హ‌సిల్దార్లు డిజిట‌ల్‌సిగ్నేచ‌ర్ చేయాల‌న్నారు.ప‌ల్స్ స‌ర్వే డాటాలో వున్న ల‌బ్దిదారుల‌కే భూముల‌ను పంపిణీ చేయాల‌న్నారు.సేక‌రించిన భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికాని ప్ర‌భుత్వ భూముల జాబితి త‌యారు చేయాల‌న్నారు.ఈస‌మావేశంలో జెసి వెట్రిసెల్వి,డి.ఆర్‌.ఓ వెంక‌ట‌సుబ్బ‌య్య‌,పి.డిహౌసింగ్ ప్ర‌సాద్‌,ఆర్.డి.ఓ హ‌రిత త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY