ప్ర‌కృతి వ్య‌వ‌సాయం వైపు రైతులను మ‌ళ్ళీంచాలి-క‌లెక్ట‌ర్‌

0
135

నెల్లూరుః ప్ర‌కృతి వ్య‌వ‌సాయం వైపు రైతులు దృష్టిసారించేవిధంగా వ్య‌వ‌సాయ‌శాఖ అధికారులు కృషి చేయాల‌ని జిల్లాక‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు అదేశించారు.మంగ‌ళ‌శారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో అయ‌న మ‌ట్లాడుతూ కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్రోత్స‌హిస్తున్న అధికారులు శ్ర‌ద్ద చూప‌డంలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను చేరుకొవ‌డంలో అధికారులు విఫ‌లం చెందార‌ని ఆన్నారు.పంట‌ల వ్య‌యంఆన్ని త‌గ్గించ‌డం,దిగుబ‌డి పెంచ‌డం భూసార పోష‌కాల‌ను పెంచ‌డం,ప్ర‌కృతి స‌మ‌తౌల్యం,వైఫ‌రీత్యాల‌ను నివారించ‌డం,ర‌సాయ‌న‌క ఎరువులు,పురుగుమందులు త‌గ్గించేందుకు వంటి లాభ‌ల‌ను దృష్టిలో వుంచుకుని ప్ర‌కృతి వ్య‌వ‌సాయాన్ని ప్ర‌భుత్వం ప్రొత్స‌హింస్తుంద‌న్నారు.ఈ విష‌యాల‌ను దృష్టిలో వుంచుకుని అధికారులు వారి వారి ల‌క్ష్యాల‌ను పూర్తిచేసేందుకు ప్ర‌ణాళిక బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో ఏజెసి-2 వెంక‌ట‌సుబ్బారెడ్డి,వ్య‌వ‌సాయ సంచాల‌కులు చంద్ర‌నాయ‌క్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY