ఐల్యాండ్స్‌ను తొల‌గించేందుకు చ‌ర్య‌లు తీసుకొండి-క‌లెక్ట‌ర్‌

0
246

నెల్లూరుః జాతీయ ర‌హ‌దారుల‌పై అనుమ‌తి లేని కూడ‌ళ్ల‌ను(ఐల్యాండ్స్‌ను) తొల‌గించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు న‌గ‌రంలోని సిగ్న‌ల్‌లైట్లు,కూడ‌ళ్లు వెడ‌ల్పు సాధ్యాసాధ్యాల‌పై త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్.ముత్యాల‌రాజు కో రారు.మంగ‌ళ‌వాంర క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ గ‌త స‌మావేశంలో చ‌ర్చింని అంశాలు తీసుకున్న నిర్ణ‌యాల‌పై చేప‌ట్టిన చ‌ర్య‌లను అడిగి తెలుసుకున్నారు.వింజ‌మూరు,ఉద‌య‌గిరి,దుత్త‌లూరు త‌దిత‌ర ప్రాంతాల్లో అవ‌స‌ర‌మైన చొట్ల ట్రామాకేర్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసే విధంగ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.డాబాల వ‌ద్ద పార్కింగ్ స్దలాల‌కు సంబంధించి తీసుకున్న చ‌ర్య‌లు ఏమిటి,ఎన్ని డాబాల‌కు నోటీసులు అందించార‌ని అడిగి తెలుసుకున్నారు.ఈ స‌మావేశంలో డిటిసి శివ‌రాం,సిటి డిస్పీ ముర‌ళీకృష్ణ‌,సంబంధిత‌ అధికారులు పాల్గొన్నారు.
మానిట‌రింగ్ క‌మిటిః– MGNREGS,,NRLM,,DDUGKY,,NSAP,,PMGSY త‌దిత‌ర ప‌థ‌కాల అమ‌లుపై జాతీయ‌స్దాయి మానిట‌రింగ్ క‌మిటి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నందున వారు సూచించిన మండ‌లాల్లో ప‌ర్య‌ట‌న‌కు అన్ని ఏర్పాట్లు చేయ‌వ‌ల‌సిందిగా సంబంధితశాఖల అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.క్యాంపు కార్యాల‌యంలో మానిట‌రింగ్ క‌మిటి స‌భ్యులు,అధికారుల‌తో అయ‌న స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించిన సంద‌ర్బంలో మాట్లాడుతూ క‌మిటి స‌భ్య‌లు ప‌థ‌కాల ఆమ‌లుపై ముఖాముఖి నిర్వ‌హించినప్పుడు బాష సమ‌స్య రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

LEAVE A REPLY