స్వ‌చ్చ స‌ర్వేక్ష‌న్‌పై విసృత్తంగా ఓటింగ్‌లో పాల్గొనాలి-క‌లెక్ట‌ర్‌

నెల్లూరుః ఓట్ ఫ‌ర్ నెల్లూరు యాప్ ద్వారా జిల్లా అధికారులు,వారి సిబ్బందిచే స్వ‌చ్చ స‌ర్వేక్ష‌న్‌పై విసృత్తంగా ఓటింగ్‌లో పాల్గొని ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో జిల్లా ముందంజ‌లో వుండేవిధంగా చూడాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు కోరారు.గురువారం క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్వ‌చ్చ‌స‌ర్వేక్ష‌ణ్‌-గ్రామ‌ద‌ర్శ‌నిపై స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ 2018కి సంబంధించి స‌ర్వేటీమ్‌లు 16 గ్రామాల్లో ప‌ర్య‌టించాయ‌ని,మరుగుదొడ్ల‌ను స‌క్ర‌మంగా వినియోగించుకోవ‌డంతో పాటు ప‌రిశుభ్రంగా వుండేలా చూడాల‌న్నారు.అధికారులంద‌రూ స‌చ్చ‌స‌ర్వేక్ష‌ణ్ బోర్డు ముందు నిల‌బ‌డి తాము ఓటు వేసిన చిహ్నంతో వాట్సప్‌గ్రూప్‌లో ప్రొఫైల్ పిక్చ‌ర్‌గా వుంచుకొని విసృత్తంగా ప్రచారం చేయాల‌న్నారు.
జిల్లాలో 38 అంశ‌ల‌పై స‌మీక్షాః-రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిలు,అక్ర‌మ‌ణ స్దిరీక‌ర‌ణ‌,బి.ఎల్‌.సి గృహాలు,అక్క‌చెరువుపాడు అప్రోచ్ రోడ్డు,బాబుజ‌గ‌జ్జీవ‌న్‌రామ్ ప‌ల్లెలో పొజిష‌న్ స‌ర్టిఫికేట్ల మంజూరు వంటి 38 అంశ‌ల‌కు సంబంధించి నివేదిక‌ల‌ను రేప‌టిలోగా అంద‌చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ అదేశించారు.ఈ సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ మైపాడు రోడ్డు,పాత చెక్‌పోస్టు, కొండాయపాళెంగేట్‌, రంగ‌నాయ‌కులపేట‌, వేదాయ‌పాళెం,త‌దిత‌రాల వ‌ద్ద ఏర్పాటు చేయానున్న‌రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిలు విష‌యంలో ప‌నులు ఎంత వ‌ర‌కు వచ్చాయి,పూర్తి వివార‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.ఈస‌మావేశంలో ఏజెసి-2 క‌మల‌కుమారి,డి.ఆర్‌.ఓ నాగేశ్వ‌రావు,ఆర్‌.డి.ఓలు నాయుడుపేట-శ్రీదేవి,ఆత్మ‌కూరు ఆర్.డి.ఓ సువ‌ర్ణ‌,డ్వామా పిడి బాపిరెడ్డి,క‌మీష‌న‌ర్ అలీంబాషా,త‌దిత‌రులు పాల్గొన్నారు.