డెంగ్యూ వ్యాధి పేరుతో అమాయ‌కుల‌ను మోసం చేస్తే క‌ఠిన చర్య‌లు-క‌లెక్ట‌ర్‌ 

0
15

నెల్లూరుః జూలై నుండి డెంగ్యూ,చికెన్ గున్యాలాంటి సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశ‌ముంద‌ని,మునిసిపాల్‌,వైద్యారోగ్య‌శాఖ మండ‌ల‌స్దాయి అధికారులు ఆప్ర‌మ‌త్తంగా వుండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు అధికారుల‌ను ఆదేశించారు.బుధ‌వారం అయ‌న సీజ‌న‌ల్ వ్యాధుల‌పై క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో మాట్లాడుతూ మండ‌ల స్దాయిల్లో డెంగ్యూవ్యాధి సోకింద‌నే సాకుతో కొంత‌మంతి వైద్యులు టెస్టులు,ఫీజుల పేరుతో పెద్ద‌మొత్తంలో బిల్లులు వ‌సూలు చేస్తున్న‌ర‌ని,అలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖాధికారుల‌ను అదేశించారు.అదేవిధంగా అన్ని మునిసిపాలిటీల్లో,మండ‌ల కేంద్రాల్లో ఆసుప‌త్రుల‌ను త‌నిఖీచేయాల‌ని అదేశార‌లు జారీ చేశారు.ఈకార్య‌క్ర‌మంలో ఏజెసి-2 వెంక‌ట‌సుబ్బారెడ్డి,ఐసిడిఎస్ పిడి ప్ర‌శాంతి,జిల్లా మాలేరియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY