పెండింగ్ ప్రాజెక్ట్ల‌ను త్వ‌ర‌త‌గ‌తిన పూర్తి చేయాలి-క‌లెక్ట‌ర్‌

0
105

నెల్లూరుః జిల్లాలో చేప‌డుతున్న ప‌లు అభివృద్ది ప‌థ‌కాల్లో భాగంగా పెండింగ్ ప్రాజెక్ట్ల‌ను త్వ‌ర‌త‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఎమ్మేల్సీ బీదా.ర‌విచంద్ర‌బ అధికారుల‌ను కోరారు.బుధ‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు అధ్య‌క్ష‌త‌న ప‌లు అభివృద్ది ప్రాజెక్టుల ప‌నుల‌పై స‌మీక్షించారు.నీరు చెట్టు ప‌థ‌కం కింద 2018-19 ఆర్దిక సంవ‌త్స‌రానికి జిల్లాకు 40 కోట్ల రూపాయ‌లు నిధులు కేటాయించార‌న్నారు.నీరు చెట్టు ప‌థ‌కం కింద ప‌నుల‌ను ఏప్రిల్ నుండి ప్రారంభించి సెప్టంబ‌ర్‌కు పూర్తి చేయాల‌న్నారు.క‌లిగిరి రిజ‌ర్వాయ‌రు పూడిక‌తీత ప‌నులు ప్రారంభించామ‌ని,రిజ‌ర్వాయ‌ర్‌లోని మ‌ట్టిని రైతులు ఉచితంగా తీసుకెళ్ల‌డానికి అనుమ‌తించాల‌న్నారు.ప్ర‌యివేట్ వ్య‌క్తులు సీన‌రేజ్ చెల్లించి మ‌ట్టిని తీసుకెళ్ల‌డానికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.అట‌వీ భూములు1016 హెక్టార్లు,సి.ఎ భూముల 1133 హెక్ట‌ర్లు డి.జి.సి.ఎఫ్ స‌ర్వే పూర్తి అయిన త‌రువాత ఎ.పి.పి.సి.సి.ఎఫ్ గుంటూరు వారికి అనుమ‌తుల కొర‌కు స‌మ‌ర్పించ‌డం జ‌రిగింద‌న్నారు.ఈనెల 12వ తేదిన తెలుగుగంగ‌,సోమ‌శిల ప్రాజెక్టు ప‌రిధిలోని అన్ని ప్యాకేజీల ప‌నుల పురోగ‌తి గురించి పుర‌పాల‌క శాఖామంత్రి డా.పి.నారాయ‌ణ క్యాంపు కార్యాల‌యంలో ఉద‌యం 8 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు స‌మీక్ష జ‌రుగుతుంద‌న్నారు.ఈ సమావేశంలో ఓఎస్డీ పెంచ‌ల‌రెడ్డి,ఏజెసి-2 వెంక‌ట‌సుబ్బారెడ్డి,డి.ఆర్‌.ఓ వెంక‌ట‌సుబ్బ‌య్య టి.జి.పి స్పెష‌ల్ క‌లెక్ట‌ర్ ప్ర‌శాంతి,ఇరిగేష‌న్ శాఖ అదికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY