నాసా అంత‌రిక్ష కేంద్రం సంద‌ర్శ‌న‌కు ఎంపికైన విద్యార్దినులు

0
95

నెల్లూరుః నాసా అంత‌రిక్ష కేంద్ర సంద‌ర్శ‌న‌కు ఎంపికైన విద్యార్దినులను జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు అభినందించారు.సోమ‌వారం అయ‌న కార్యాల‌యంలో త‌డ‌లో కె.జి.బి.వి పాఠ‌శాల్లో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఎం.చెంచులావ‌ణ్య‌,వెంక‌ట‌గిరి కె.జి.బి.వి పాఠ‌శాల్లో 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న వి.అశ్వినిల‌కు పుష్ఫ‌గుచ్చాలందించి అభినంద‌న‌లు తెలిపారు.ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు చెందిన విద్యార్దినిల లాగే మెరుగైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌ర్చ‌డానికి ఉపాధ్యాయులు కృషి చేయాల‌ని కోరారు.ఈకార్య‌క్ర‌మంలో స‌ర్వ‌శిక్ష అభియాన్ పిడి విశ్వ‌నాధ్ త‌ద‌త‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY