స్వ‌రే పేరుతో టీమ్‌లు కాల‌యాప‌న చేస్తే స‌హించేది లేదు-క‌లెక్ట‌ర్‌

0
79

నెల్లూరుః రైతుల జీవిత్తాల్లో అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన భూరికార్డుల న‌వీక‌ర‌ణ‌ను సిబ్బంది చిత్త‌శుద్ది,అంకిత‌భావంతో ప‌నిచేసి పూర్తి చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్.ముత్యాల‌రాజ అన్నారు.భూరికార్డుల న‌వీక‌ర‌ణ‌పై మంగ‌ళ‌వారం సాయంత్రం జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఆర్‌.డి.ఓల‌తో స‌ర్వేఅధికారుల‌తో,రెవెన్యూ సిబ్బందితో స‌మావేశం నిర్వ‌హించారు.అయ‌న మాట్టాడుతూ భూరికార్డులు ప‌క్కాగా త‌యారుచేయ‌డానికి నియ‌మించిన బృందాలు గ‌డ‌వులోగా పూర్తిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.స్వ‌రే పేరుతో బృందాలు కాల‌యాప‌న చేస్తే స‌హించేది లేద‌ని క‌లెక్ట‌ర్ హెచ్చరించారు.చిన్న చిన్న పొర‌పాట్లు చేసినా ల‌క్ష్యం నేర‌వేర‌ద‌న్నారు.పూర్తి చేసిన ద‌స్త్రాలు క‌లెక్ట‌ర్ కార్యాల‌యంకు పంపితే త‌నిఖీ చేస్తామ‌న్నారు.కావ‌లి,నాయుడుపేట‌,నెల్లూరు డివిజ‌న్ల‌లో ఫలితాలు ఇంకా మెరుగు ప‌డాల్సి వుంద‌న్నారు. భూరికార్డుల న‌వీక‌ర‌ణ‌పై ప్ర‌తివారం స‌మావేశాలు నిర్వ‌హిస్తాన‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.అనంత‌రం క‌లెక్ట‌ర్ వెబ్‌ల్యాండ్ వెరిఫికేష‌న్‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.ఈస‌మావేశంలో సంయుక్త క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌,జిల్లాలోని అంద‌రే ఆర్‌.డి.ఓలు రెవెన్యూ,స‌ర్వే అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY