నిత్య‌జీవితంలో ప్ర‌తి ఒక్క‌రు వ్యాయమంకు కేటాయించాలి-క‌లెక్ట‌ర్‌

నెల్లూరుః నిత్య‌జీవితంలో ప్ర‌తి ఒక్క‌రికి మాన‌సిక ఒత్త‌డి పెరుగుతుంద‌ని,రోజు కొంత స‌మ‌యం వ్యాయమంకు కేటాయించిన‌ట్ల‌యితే మ‌ధుమేహం లాంటి స‌మ‌స్య‌ల‌ను అధిక‌మించ వ‌చ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్.ముత్యాల‌రాజు అన్నారు.బుధ‌వారం ప్రపంచ మధుమేహవ్యాధి దినోత్సవం సందర్భముగా నెల్లూరులోని మెడికల్ హాల్ నందు ప్రైమ్ మెడికల్ సొసైటీ వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ చిన్న పిల్లలో టైప్‌-1 డ‌యాబెటిక్స్ పెరుగుతుంద‌ని,విద్యార్దుల ప్ర‌తిరోజు ఏదో ఒక ఆట‌కు కొంత స‌మ‌యం వెచ్చించాల‌న్నారు.అనంత‌రం 40 మంది టైప్‌-1 డ‌యాబెటిక్ పిల్ల‌ల‌కు డాక్ట‌రు రామోహ‌న్ అంద‌చేస్తున్న ఉచిత‌ ఇన్సులిన్ డిజిటల్ టెస్టింగ్ కిట్,ఇన్సులిన్ మందుల క‌లెక్ట‌ర్ అందించారు.ఈకార్య‌క్ర‌మంలో డా.ఎం.వి.రామోహన్ (ఎండ్రోకైనాజిస్ట్‌),డా.సత్యనారాయణ మూర్తి,(డయాబేటాలాజి),ఇతర డాక్ట‌ర్లు,సభ్యులు పాల్గొన్నారు.