ఏప్రిల్‌ 24 నుండి మే 31 వ‌ర‌కు మీ భూమికి-భ‌రోసా-క‌లెక్ట‌ర్‌

0
24

నెల్లూరుః చుక్క‌ల‌భూములు,22ఎ రిజిష్ట‌ర్లు,నోష‌న‌ల్ ఖాతాల‌కు సంబంధించి,భూమికి సంబంధించి చిన్న చిన్న సమ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకై ఏప్రియ‌ల్ 24 నుండి మే 31 వ‌ర‌కు మీ భూమికి-భ‌రోసా కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్.ముత్యాల‌రాజు పేర్కొన్నారు.మంగ‌ళ‌వారం వింజ‌మూరు మండ‌లం జిల్లాప‌రిష‌త్ ప్రాథ‌మిక పాఠ‌శాల ఆవ‌రంలో ఏర్పాటు చేసిన మీ భూమికి-భ‌రోసా కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడుతూ వింజ‌మూరు మండ‌లంలో నోష‌న‌ల్ ఖాతాలు 1575గా గుర్తించ‌డం జ‌రిగింద‌ని,వాటిని రెగ్యుల‌రైజ్ చేయడానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌న్నారు.అదే విధంగా ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హించే గ్రీవెన్స్‌ల్లో ఎక్కువ‌గా రెవెన్యూ సంబంధిత స‌మ‌స్య‌ల వున్నందున ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు.స్మార్ట్‌ప‌ల్స్ స‌ర్వే ఆధారంగా ల‌బ్దిదారును గుర్తించి ఒక ఎక‌రాకు 40 మంది చొప్పున నివాస స్ద‌లాలు అంద‌చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.వింజ‌మూరు మండ‌లంలో ఒక కాల‌నీలో 23 గృహాలు నిర్మించ‌డం జ‌రిగింద‌ని,మ‌రో 2 గృహాలు నిర్మించిన పిద‌ప రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి మౌలిక వ‌స‌తుల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో ఆత్మ‌కూరు ఆర్‌.డి.ఓ బాపిరెడ్డి,ఎమ్మేర్యో లావ‌ణ్య‌,జ‌డ్పీటిసి వెంక‌ట‌నారాయ‌ణ‌రెడ్డి,బాల‌కృష్ణారెడ్డి,ఎమ్పీటిసి కృష్ణ‌కిర‌ణ్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY