రైతు భరోసా ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం-సీఎం జగన్

ఉదారంగా నిధులు విడుదల చేయాలి..అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నసీ.ఎం సాయంత్రం 4:30 గంటలకు ప్రధానితో సమావేశమైయ్యి రాష్ట్రనికి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. ఈ నెల 15వ తేదిన రైతు భరోసా కార్యక్రమ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని సీఎం జగన్ ఆహ్వానించారు.అలాగే పోలవరం రివర్స్ టెండర్ల ద్వారా సుమారు రూ.800 కోట్లు ఆదా చేసినట్లు ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.పోలవరం ప్రాజెక్టు రెవెన్యూ లోటు భర్తీకి నిధులు ఇవ్వాలని కోరారు.రైతు భరోసా పథకం కింద వ్యవసాయ కుటుంబాలకు రూ.12,500 పెట్టుబడి నిధి అందించేందుకు సీఎం జగన్ నిర్ణయించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి జగన్ ఆహ్వాన పత్రాన్ని జగన్ అందజేశారు. సుమారు 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని జగన్ కోరారు. విభజన హామీలు, కడపలో ఉక్కు పరిశ్రమ తదితర అంశాలు ప్రధానితో సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేయాలని సీఎం జగన్ విన్నవించారు.అలాగే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, విశాఖ, కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు సహకారం తదితర విషయాలపై ప్రధానితో సమావేశంలో చర్చించినట్లు సమాచారం.అప్పులతోనే రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకురావాల్సిన పరిస్థితి ఉన్న కారణంగా కేంద్రం ఉదారంగా సాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా కూడా తగ్గే అవకాశం ఉందని, ఆ లోటును కూడా భర్తీ చేయాలని విజ్ఞ‌ప్తి చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వినతిపత్రాలను అందజేశారు.జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు.