అధికారులు రాష్ట్రన్ని అభివృద్ది బాట‌లో నిల‌పాలి-ముఖ్య‌మంత్రి

0
92

వీడియో కాన్ప‌రెన్స్‌
నెల్లూరుః అధికారులు,ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారంతో రాష్ట్రన్ని అన్ని రంగాల్లో ఆగ్ర‌స్దానంలో నిలిపామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు.శుక్ర‌వారం వెల‌గ‌పూడి నుండి వీడియోకాన్ప‌రెన్స్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ల ఉద్దేశించి అయ‌న మాట్లాడుతూ జాతీయ‌,అంత‌ర్జాతీయ స్దాయిలో వివిధ రంగాల్లో 16 ఆవార్డుల‌ను రాష్ట్ర సాధించింద‌ని,వృద్ది రేటు కూడా10.5 శాతం న‌మోదైంద‌ని తెలిపారు.అధికార‌,అన‌ధికారుల‌ను ప్రోత్స‌హించ‌డం ద్వారా ఇది సాధ్య‌మైంద‌న్నారు.అభివృద్దిలో ఉద్యోగుల‌ను అన్ని ర‌కాలుగా ప్రోత్స‌హిస్తున్న‌మ‌ని,తద్వారా రాష్ట్రన్ని అభివృద్ది బాట‌లో నిల‌పాల‌న్నారు.భూగ‌ర్బ‌జాల‌ల‌ను పెంచ‌డం,న‌దుల అనుసంధానం త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌త్యేక‌దృష్టి నిలిపామ‌ని,మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్న‌మ‌ని తెలిపారు.విద్య‌త్పుత్పాద‌న 22.5 మిలిన్ మెగావాట్లు వుంద‌ని,క‌రెంట్ చార్జీలు త‌గ్గించే స్దాయిలో ప్ర‌భుత్వం వుంద‌న్నారు.అంత‌కు ముందు ఇన్‌చార్జీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్‌చంద్ర పునేఠా రాష్ట్ర ప్ర‌గ‌తిని వివ‌రించారు.ఈ సమావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్.ముత్యాల‌రాజు,జెసి వెట్రిసెల్వి,ఏజెసి-2 క‌మల‌కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY