శ‌శిక‌ళ కుటుంబ స‌భ్యుల ఆస్తులు 4500 కోట్లు

0
164

ప్ర‌భుత్వానికి 1,430 కోట్ల వరకూ పన్ను ఎగవేత‌..? 
అమ‌రావతిః మన్నారుగుడి మాఫీయ‌కు సంబంధించి ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాధించారని జైలు శిక్ష పడిన వీకే. శశికళ నటరాజన్ ను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోనే విచారణ చెయ్యాలని ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ణయించారు. శశికళ ఫ్యామిలీకి చెందిన రూ. 4.500 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. ఫిబ్రవరి 10వ తేదీ త‌రువాత‌ చెన్నైకి చెందిన ఆదాయపన్ను శాఖ అధికారుల ప్రత్యేక బృందం బెంగళూరు జైల్లోనే శశికళను విచారణ చేసి డోల్లా కంపెనీల వ్యవహారం, ప్రభుత్వానికి చెందిన గుట్కా అవినీతికి సంబంధించిన లేఖ ఆమె గదిలోకి ఎలా వచ్చింది అనే వ్యవహారంపై పూర్తి సమాచారం సేకరించడానికి ఆదాయపన్ను శాఖ అధికారులు సిద్దం అయ్యారు.శశికళ నటరాజన్ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని గత ఏడాది నవంబర్ నెలలో ఏకకాలంలో 187 చోట్ల నిర్వహించిన ఐటీ సోదాల వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం అయ్యింది. ఇప్పటికే శశికళ కుటుంబ సభ్యులను విచారించిన ఆదాయపన్ను శాఖ అధికారులు బెంగళూరు జైల్లో చిన్నమ్మను కూడా విచారణ చెయ్యాలని నిర్ణయించారు.డొల్లా కంపెనీల ద్వారా శశికళ కుటుంబ సభ్యులు రూ.1, 430 కోట్ల వరకూ పన్ను ఎగవేశారని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు.ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళ కుటుంబ సభ్యులకు మూడు నెలల్లో సరైన సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేశారు. ఇక శశికళ నటరాజన్ ను విచారణ చేస్తే దర్యాప్తులో ముందడగుపడుతోందని అధికారులు భావిస్తున్నారు.బెంగళూరు సెంట్రల్ జైల్లో శశికళ నటరాజన్ మౌనవ్రతం చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీ తరువాత శశికళను విచారణ చెయ్యాలని ఆదాయపన్ను శాఖ అధికారులు ఇప్పటికే బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులకు లేఖ రాశారు.శశికళను విచారణ చెయ్యడానికి చెన్నైలోని ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారులు సిద్దం అయ్యారు. ఒక్క రోజు, లేదా రెండు రోజుల పాటు శశికళను విచారణ చేసి ఆమె ఇచ్చే సమాధానంతో తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ఆదాయపన్ను శాఖ అధికారులు ఆలోచిస్తున్నారు.

LEAVE A REPLY