బ‌దిలీల‌పై ప‌లు నిబంధ‌న‌లు-కేబినేట్ నిర్ణ‌యాలు

0
34

అమ‌రావ‌తిః ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన బుధ‌వారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 5 గంట‌ల నుండి సుదీర్ఘంగా కొనసాగుతోంది.ఇందులో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.మే 4 నుండి జూన్ 5 వ‌ర‌కు బ‌దిలీలకు ప‌చ్చ‌జెండా ఉపింది.3 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న‌వారికి బ‌దిలీల‌కు ఆర్హ‌త‌.ఇందులో ఉపాధ్యాయుల‌కు ఈసారి బ‌దిలీల్లో అనుమ‌తి లేదు.ఆరోగ్య స‌మ‌స్య‌లు,విక‌లాంగులు,వితంతువు లాంటి కేసులు వుంటేనే బ‌దిలీలు,భార్య‌,భ‌ర్త‌ల విష‌యంలో క‌నీసం 8 సంవ‌త్సర‌ల బ‌దిలీ కాలం వుంటేనే బ‌దిలీ ,ఏసిబి,విజిలెన్స్ కేసుల్లో వున్న‌వారికి వ‌ర్తించ‌వని స్ప‌ష్టం చేసింది.య‌ధావిధిగా జూన్ 5 త‌రువాత బ‌దిలీల‌పై నిషేధం.రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ కార్యాలయం ఏర్పాటుకు 2 వేల గజాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పీపీపీతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి ఆమోదం తెలిపారు. బందరు పోర్టుకు రైల్వే కనెక్టివిటీ కోసం ఇన్‌క్యాప్‌కు 1092 కోట్ల రుణాల గ్యారెంటీకి నిర్ణయం తీసుకున్నారు.అలాగే కొత్త పీఆర్‌సీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం,ఏపీ కంపల్సరీ రిజిస్ట్రేషన్‌ ఆఫ్ మ్యారేజెస్‌ యాక్ట్‌-2002కు సవరణల ఆర్డినెన్స్‌కు ఆమోదం,చంద్రన్న పెళ్లి కానుకలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తూ ఆర్డినెన్స్‌కు రూపకల్పన,వివిధ వర్గాలకు ఒకే ప్లాట్‌ఫామ్‌ ద్వారా కానుక అందించేందుకు ఆర్డినెన్స్‌కు రూపకల్పన,సీఆర్‌డీఏలో వివిధ సంస్థలు, కార్యాలయాలకు 51.92 ఎకరాల కేటాయింపునకు ఆమోదం,సీబీఐ, ఫోరెన్సిక్ ల్యాబ్‌ ల కోసం రెండు ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం
మరో 19 జాతీయ సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.స‌మావేశం కొన‌సాగుతుంది.

LEAVE A REPLY