చంద్ర‌బాబు,లోకేష్‌ ప‌ర్య‌ట‌న వివ‌రాలు

0
127

నెల్లూరుః రాష్ట్ర ముఖ్య‌మంత్ర నారా.చంద్ర‌బాబునాయుడు,అయ‌న కుమారుడు నారా.లోకేష్‌లు శుక్ర‌వారం నెల్లూరుజిల్లా నాయుడుపేట‌లో నిర్వ‌హించ‌నున్న న‌వ‌నిర్మాణ‌దీక్ష ముంగింపు కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు.ఉద‌య 9.30 గంట‌ల‌కు చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి జడ్పీహైస్కూల్ గ్రౌండ్స్ నుండి హెలీకాప్ట‌ర్‌లో బ‌య‌లుదేరి పెళ్లకూరు మండ‌లం ప‌రిధిలోని తాడ్వాయ‌పాడు గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు 10.30 గంట‌లకు చేరుకుంటారు.రోడ్డు మార్గంలో తాడ్వాపాడు గ్రామంకు చేరుకుని 10.45 నుండి 1.15 వ‌ర‌కు అక్కడ ఏర్పాటు చేసిన గ్రామ‌ద‌ర్శ‌ని,గ్రామ‌స్తుల‌తో మాట‌,మంతీ,ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.అనంత‌రం 2 గంట‌ల‌కు ALCM Grounds చేరుకుని అక్క‌డ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప‌రిశీలిస్తారు.త‌రువాత మ‌హాసంక‌ల్పం కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.5 గంట‌ల‌కు తిరిగి తాడ్వాయ‌పాడు హెలీప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుండి రేణిగుంట విమాన‌శ్ర‌యంకు వెళ్లనున్నారు.

LEAVE A REPLY