పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ గమ్యస్థానం-ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు

0
107

విశాఖ‌ప‌ట్నంః పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ గమ్యస్థానంగా నిలుస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం కీలకోపన్యాసం చేశారు. రాష్ట్రంలో మూడోసారి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో శాశ్వత కన్వెన్షన్‌ కేంద్రం, షాపింగ్‌మాల్స్‌, హోటళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గతేడాది కంటే ఈసారి భాగస్వామ్య సదస్సుకు స్పందన బాగుందని హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. 2022 నాటికి దేశంలో మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ను నిలపడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. 2029 నాటికి దేశంలో అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈసారి రాష్ట్రంలో 13.8 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. నీటి నిర్వహణ పద్ధతుల ద్వారా వ్యవసాయంలో గణనీయంగా వృద్ధిరేటు సాధిస్తున్నట్టు సీఎం చెప్పారు.

LEAVE A REPLY