రెవెన్యూ అంశాల్లో నెల్లూరు జిల్లా పురోగ‌మించాలి-పునేత్‌

0
85

నెల్లూరుః రెవెన్యూ అంశాల్లో నెల్లూరు జిల్లా పురోగ‌మించాల్సిన అవ‌స‌ముంద‌ని చీఫ్ క‌మీష‌న‌ర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ర్టేష‌న్ అనిల్ సి పునేత అన్నారు.శనివారం క‌లెక్ట‌ర్ క్యాంప్ కార్యాల‌యంలో అధికారుల స‌మావేశంలో మాట్లాడారు.అంత‌కు ముందు జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్.ముత్యాల‌రాజు జిల్లాలో రెవెన్యూ ఆంశాల పురోగ‌తిని పురస్క‌రించుకొని పునేత‌కు వివ‌రించారు.జిల్లాలో ప‌ట్టాదారుపాసుపుస్త‌కాలు,ఆథార్ ఫీడింగ్,మీ భూమి,భూసేక‌ర‌ణ‌,చుక్క‌ల‌భూములు,నోడ‌న్‌ఖాతా నెంబ‌ర్లు,రైతుల మొబైల్ నెంబ‌ర్ల న‌మోదు,త‌దిత‌ర ఆంశాల్లో ఆంశాల్లో చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను క‌లెక్ట‌ర్ వివ‌రించారు.పునేత మాట్లాడుతూ ఆయా ఆంశాల్లో అధికారులు ఇంకా అనేక చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి వుంద‌ని,మార్చి నెలాఖరుకు ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని అదేశించారు.ఈ సమావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ ఇంతియాజ్‌,నెల్లూరు,కావ‌లి,నాయుడ‌పేట‌,గూడూరు,ఆత్మ‌కూరు ఆర్‌.డి.ఓలు,త‌హిసిల్దార్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY