రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుంది-బీజెపీ 

ఇసుక విధానంకు నిరసనగా భిక్షాటన..నెల్లూరు: గత ప్రభుత్వం ఇసుక విధానలకు భిన్నంగా ప్రజలకు ఇసుక అందించే నిర్ణయలు తీసుకుంటుమని ఎన్నికల్లో ఓట్లు పొందిన వైసీపీ,నేడు కోట్ల రూపాయలతో వైసీపీ నాయకుల జేబులు నింపేందుకు ప్రజ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందని,ఇందుకు నిరసనగా బీజెపీ అధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని బీజెపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి,అధికార ప్రతినిధి అంజనేయులరెడ్డి చెప్పారు.సోమవారం నగరంలోని బీజెపీ కార్యాలయం నుండి గాంధీ విగ్రహాం వరకు భిక్షాటన కార్యక్రమం నిర్వహించిన సందర్బంలో వారు మాట్లాడారు.ఈకార్యక్రమంలో సత్యానారాయణ,కరణం.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.