జగన్మోహన్‌రెడ్డి,పవన్ కల్యాణ్‌లను బీజేపీ నడిపిస్తుంటే-సోము వీర్రాజు

0
26

అమ‌రావ‌తిః జగన్మోహన్‌రెడ్డి,పవన్ కల్యాణ్‌లను బీజేపీ నడిపిస్తుంటే,40 ఏళ్ల అనుభవమున్నచంద్రబాబు ఎవరిని నడిపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధ్య‌క్ష‌డు సోము.వీర్రాజు ప్రశ్నించారు.మంగ‌ళ‌వారం అయ‌న మీడీయాతో మాట్లాడుతూ ఆంధ్ర‌ ప్రజలను గాలికొదిలేశారని,దేశ, కర్ణాటక రాష్ట్ర రాజకీయాలతోనే ఆయన కాలం గడుపుతున్నారని,సాధికార సభల్లోనూ రాజకీయాలే ప్రస్తావిస్తున్నారంటూ ముఖ్య‌మంత్రిపై విరుచుకుపడ్డారు.చంద్రబాబునాయుడు ప్రభావం కర్ణాటక ఎన్నికల్లో ఉంటే బీజేపీకి 25 శాతం నుంచి 35 శాతం ఓట్లు ఎలా సాధించిందని ప్రశ్నించారు.డిపాజిట్లు కోల్పోయిన పార్టీ నేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు అయ‌న‌ ఉవ్విళ్లూరుతున్నారని త‌ప్ప‌ప‌ట్టరు.కాంగ్రెస్ పార్టీతో కలిసి జీవించే సంస్కృతి చంద్రబాబుదని,దీక్షల పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.గ‌తంలో వాజ్ పేయి ప్రభుత్వాన్నిపడగొట్టి దేవెగౌడకు మద్దతిచ్చారని,చంద్ర‌బాబు న‌మ్మ‌క‌మైన మిత్ర‌ప‌క్షం కాద‌న్నారు. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఉచిత విద్యను అందించాల్సిన ప్ర‌భుత్వం,విద్యార్దుల త‌ల్లి,తండ్రుల‌న‌ పీల్చి పిప్పీ చేస్తున‌ కార్పొరేట్ స్కూళ్లకు అప్పగించారంటూ మండిపడ్డారు.ఈ సందర్భంగా తిరుమలలో జరుగుతున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ‘అమిత్ షాను రమణదీక్షితులు కలవడాన్ని తప్పుపడతారా? తిరుపతిలో ఎల్ 1, ఎల్ 2 సేవలు ఎవరికి అమ్ముతున్నారని ప్రశ్నించారు.

LEAVE A REPLY