రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్‌

0
151

క‌ర్నూలుః కర్నూల్లో రాయ‌ల‌సీమ బిజెపి నేత‌లు రాయలసీమకు సంబంధించిన డిక్లరేషన్‌ను ప్రకటించారు.శుక్ర‌వారం జరిగిన సమావేశంలో ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు.అవిః1.రాష్ట్ర రెండో రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి.2.సీమ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయాలి.3.రాయలసీమలో ఉన్న 4 జిల్లాలను 8 జిల్లాలుగా విభజించాలి.4.సీమ ఇరిగేషన్ కు రూ. 10 వేల కోట్లు కేటాయించాలి.5.వచ్చే బడ్జెట్ లో రాయలసీమకు రూ. 20 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలి. 6.రాయలసీమ అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలి.7.ప్ర‌తి ఆరు నెలలకు ఒకసారి రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలి. బీజేపీ నేతలు మాట్లాడుతూ,అమరావతిని మరో హైదరాబాద్ చేయవద్దని, రాయలసీమను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. డిక్లరేషన్‌లోని డిమాండ్లను సాధించుకునే క్రమంలోఈ నెల 28వ తేదీ నుంచి కడప జిల్లాలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్న‌ట్లు తెలిపారు.

LEAVE A REPLY