టీడీపీది మహానాడు కాదు మాయనాడు-క‌న్నా.ల‌క్ష్మినారాయ‌ణ‌

0
112

అమ‌రావ‌తిః నాలుగేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో టీడీపీ ఉందని,అభుత‌క‌ల్ప‌న‌లు,ప‌ర‌నింద‌లు త‌ప్ప‌ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.సోమ‌వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,టీడీపీది మహానాడు కాదు మాయనాడని,ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాదని విమర్శించారు.చంద్రబాబు అసమర్థత వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని,కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు అద్దె మైకులా మారారని ఎద్దేవా చేశారు.అమరావతి రాజధాని రైతులకు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారని, రైతుల భూములను రియల్ ఎస్టేట్ కు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై చెప్పులేయించిన ఘనత చంద్రబాబుదేనని,ఎన్టీఆర్ మృతికి ఆయనే కారణమని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీకి ఓటువేయొద్దని చంద్రబాబు చెప్పినప్పటికి అక్కడ తెలుగు వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో 16 సీట్లు గెలిచామని అన్నారు.సాగునీటి ప్రాజెక్టుల్లో అవినితి అమాంతంగ పెరిగిపోతున్న‌య‌ని,ఇందుకు పోల‌వరంకు 16 వేల కోట్ల నుండి 60 వేల కోట్ల‌కు పెర‌గ‌డ‌మేన‌న్నారు.

LEAVE A REPLY