రాష్ట్రంలో పాల‌న లేదు వ్యాపారం మాత్రమే జరుగుతోంది-సోము వీర్రాజు

0
114

క‌ర్నూలుః రాష్ట్రంలో పాల‌న లేదు వ్యాపారం మాత్రమే జరుగుతోందని, రెండెకరాల రైతును అంటున్నమీకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని పరోక్షంగా టిడిపి అధినేత చంద్రబాబుపై సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆరోపించారు.ఆదివారం కర్నూలు అసెంబ్లీ పరిధిలో బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.టీడీపీ నాయకులు అవినీతికి వారసులంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం చంద్రబాబుపైనా పరోక్షంగా ఆరోపణలు గుప్పించారు.మేము నిప్పులాంటి వాళ్లం. మీరు అవినీతికి వారసులంటూ నిప్పులు చెరిగారు. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడమే నా అజెండా నాకు సొంత ఎజెండా లేదని చెప్పారు.తమ పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే అవినీతిపై ఎదురుతిరుగుతున్నామని,రాష్ట్రంలోని బిజెపి నాయ‌కుల‌కు ఎలాంటి సొంత అజెండా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నాంది పలికింది కేంద్ర ప్రభుత్వమేనని గుర్తు చేశారు. కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థ పరులకు ఆదాయ వనరులుగా మారాయని ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ బొమ్మ వాడడానికి రాష్ట్రం భయపడుతోందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి పనుల్లో ప్రధాని పేరు ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరెంటు సమస్యలు తీర్చడానికి 5 వేల కోట్ల రూపాయల నిధులు మోదీ ప్రభుత్వం ఇచ్చిన విష‌యం రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని గుర్తు చేశారు.

LEAVE A REPLY