కొత్త గవర్నర్ నియామకం వెంటనే జరిగితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మంచిరోజులు

0
103

విశాఖ‌ప‌ట్నంః నాలా బిల్లు పెట్టి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకూ ఆ బిల్లు పాస్ కాలేదని,చుట్టపు చూపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పోవడం మినహా గవర్నర్‌ నరసింహన్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఏపీ బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు.విశాఖపట్నంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాష్ట్ర విభజన జరిగి నలభై నెలలు దాటినా ఏనాడూ ఏపీ బాగోగులు పట్టించుకోలేదని విమర్శించారు. కనీస బిల్లులు పాస్ చేసేందుకు కూడా గవర్నర్ ఆసక్తి కనబర్చడం లేదని వాపోయారు.బడ్జెట్ సమావేశాల్లోగా కొత్త గవర్నర్‌ను నియమించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో గవర్నర్ నివాసానికి అనువైన వసతులు లేవన్న కారణంగా రాలేకపోతున్నారా? అని ప్రశ్నించారు. కొత్త గవర్నర్ నియామకం వెంటనే జరిగితే నూత‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మంచి జరుగుతుందన్నారు.

LEAVE A REPLY